స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ అంటూ అన్నీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడుతున్నారు. కానీ, గ్లాసెస్ మాత్రం సాధారణమైనవి వాడుతుంటారు. ఎందుకంటే స్మార్ట్ గ్లాసెస్ చాలా ఖరీదు కాబట్టి. అయితే ఇప్పుడు మార్కెట్ లో కేవలం రూ.949కే స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాటలు వినచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.
ప్రస్తుతం అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, బ్లూటూత్ స్పీకర్స్ అంటూ కొనుగోలు చేస్తుంటారు. చాలా మందికి స్మార్ట్ గ్లాసెస్ ఉంటాయని తెలుసు. కానీ, వాటిని కొనేందుకు మాత్రం ఆసక్తి చూపించరు. అందుకు ప్రధాన కారణం అవి విపరీతమైన రేట్లు ఉండటమే. అవును స్మార్ట్ గ్లాసెస్ కొనాలంటే వేలల్లో ఖర్చు చేయాలి. అందుకే సాధారణంగా స్మార్ట్ గ్లాసెస్ కొనుగోలు చేయరు. కానీ, ఇప్పుడు మీ కోసం ANT ఈస్పోర్ట్స్ అనే స్మార్ట్ గ్లాసెస్ తీసుకొచ్చాం. వాటి ధర వేలల్లో కాదు.. వందల్లోనే ఉంటుంది. తక్కువ ధర కదా అని తీసి పారేయకండి. ఇందులో చాలా ఫీచర్లు కూడా ఉన్నాయి.
స్మార్ట్ గ్లాసెస్ ఉంటాయని తెలిసినా.. వాటి ధరల కారణంగా కొనేందుకు వినియోగదారులు ముందుకు రారు. వచ్చినా కూడా అవి ఎలా పనిచేస్తాయి? వాటిని మనం ఎలా యాక్సెస్ చేస్తాం అనే అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అదే మీరు ఏఎన్టీ ఈస్పోర్ట్స్ గ్లాసెస్ తీసుకుంటే ఆ అనుమానాలు, భయాలు అక్కర్లేదు. కేవలం రూ.949కే ఈ స్మార్ట్ గ్రాసెస్ వస్తున్నాయి. వీటిని వాడటం కూడా ఎంతో సులభం. మీ ఫోన్ బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్స్ కూడా ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్మార్ట్ గ్లాసెస్ యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి.
ఈ ఏఎన్టీ ఈస్పోర్ట్స్ మొదట క్లియర్ లెన్స్ లతో వస్తాయి. ఇవి యూవీ, బ్లూ రే ప్రొటెక్టెడ్ గ్లాసెస్. అంటే మీరు ఫోన్ వాడే సమయంలో మొబైల్ నుంచి వచ్చే హానికర కిరణాలను 50 శాతం మేర తగ్గిస్తుంది. వీటిని ప్రధానం గేమర్స్ కోసం తీసుకొచ్చారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు దీనిని కనెక్ట్ చేసుకుంటే అటు మీ కళ్లకు ప్రొటెక్షన్ లభిస్తుంది. మరోవైపు మీ టీమ్మేట్స్ తో మాట్లాడటం, వారి మాటలు వింటూ ఎంచక్కా గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు కావాలంటే వీటిని షేడ్స్ గా కూడా మార్చుకోవచ్చు. అందుకు అదనంగా బ్లాక్ లెన్స్ లు ఇస్తున్నారు. ఇందులో వాయిస్ కంట్రోల్ ఉంటుంది. మీరు ఫోన్ మాట్లాడవచ్చు, మ్యూజిక్ వినవచ్చు కూడా. దీని ధర రూ.2,499 కాగా కేవలం రూ.949కే అందిస్తున్నారు. ఈ ANT ESports స్మార్ట్ గ్లాసెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.