వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుండే వాట్సాప్, మరో కొత్త ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనుంది. అదే.. వాట్సాప్ పోల్స్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు గ్రూపులలో పోల్ నిర్వహించవచ్చు. అంటే.. టీవీ వాళ్లు చేసే ‘పోల్ – అభిప్రాయం’ ఇకపై వాట్సాప్ లో నిర్వహించవచ్చన్నమాట. ఇది కేవలం గ్రూప్ చాట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని సహాయంతో వాట్సాప్ యూజర్లు ఒక ఒపీనియన్ పోల్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ప్రశ్న నమోదు చేసి ‘ఎస్/నో ‘చెప్పేలా ఆప్షన్స్ ఇవ్వొచ్చు.
ఈ ఫీచర్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏంటంటే.. ఏదైనా ఒక విషయంపై నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ మంది ఎటువైపు మొగ్గుచూపుతున్నారనేది తెలుసుకోవచ్చు. పోల్ క్రియేట్ చేసి సభ్యులతో షేర్ చేస్తే, వారి తమకు నచ్చిన ఆప్షన్ ను సెలెక్ట్ చేసి పోల్ లో పాల్గొనవచ్చు. అయితే.. గ్రూపు మెంబర్లకు కూడా అవకాశం ఇస్తారా? లేదా అడ్మిన్ లు మాత్రమే ఛాన్స్ ఉంటదా? అన్నది వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఇది షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో క్రియేట్ పోల్, వాట్ ఇస్ యువర్ పోల్ క్వశ్చన్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్, త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఇదేకాకుండా వాట్సాప్ చాట్ ను సులువుగా బ్యాకప్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకునేందుకు వీలుగా మరో కొత్త ఫీచర్ ను కూడా వాట్సాప్ జోడించనుంది. ప్రస్తుతం చాట్ ను, యూజర్లు గూగుల్ డ్రైవ్ లోనే బ్యాకప్ చేసుకోగలరు. దీంతో కొత్తగా ఏదైనా డివైజ్ లో లాగిన్ అవుతుంటే.. పాత డివైజ్ నుంచి గూగుల్ డ్రైవ్ లోకి.. ఆపై కొత్త డివైజ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తోంది.ఈ సమస్యకు తావరలోనే పరిష్కారం చూపనుంది. కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ తో లోకల్ డ్రైవ్ నుంచే చాట్ ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్లపై, మీ అభిప్రాయాలను కాన్మెంట్ల రూపంలో తెలియజేయండి.