దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్స్ లో సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉంటుంది. భారతదేశంలో అయితే సంస్థలు, కంపెనీలు కూడా బిజినెస్ కోసం ఈ యాప్ ని వాడుతున్నాయి. వాట్సాప్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చింది.
వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ కి ఎంతో మంచి ఆదరణ ఉంది. సాధారణంగా చాలా తక్కువ సమయంలో బాగా పాపులర్ అయిన సోషల్ మెసేజింగ్ యాప్. వాట్సాప్ ని కేవలం మేసెజింగ్ కోసం మాత్రమే కుడాం వాయిస్ కాల్, వీడియో కాల్, ఇమెజేస్, వీడియోస్ షేరింగ్ కోసం వాడుతుంటారు. ఇప్పుడు వాణిజ్యం పరంగా కూడా వాట్సాప్ కి మంచి డిమాండ్ పెరిగింది. తమ వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పుడూ అప్ డేట్స్- ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. దాదాపు నెలకు ఒక అప్ డేట్ అయినా ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో వాట్సాప్ యూజర్ల ముందుకొచ్చింది. ఈసారి అడ్మిన్స్ కి ఇవి బాగా నచ్చుతాయి.
వాట్సాప్ ఎప్పుడూ ఆండ్రాయిడ్- ఐఓఎస్ యూజర్ల కోసం తరచూ అప్ డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా సరికొత్త ఫీచర్స్ తో యూజర్స్ ముందుకొచ్చింది. అయితే ఈసారి తీసుకొచ్చిన ఫీచర్స్ ప్రత్యేకంగా అడ్మిన్స్ కోసం అని చెప్పచ్చు. పైగా ఈ ఫీచర్స్ అడ్మిన్స్ కచ్చితంగా నచ్చుతాయి కూడా. నిజానికి వాట్సాప్ గ్రూపుల విషయంలో ఏం పొరపాటు జరిగినా, అసత్యాలు ప్రచారాలు చేసినా ముందుగా గ్రూప్ అడ్మిన్ నే పోలీసులు బాధ్యులను చేస్తారు. అందుకే అడ్మిన్స్ కి కొన్ని ప్రత్యేక ఫీచర్స్, అధికారులు ఉండటం ఎంతనై అవసరం అనే అభిప్రాయాలు చాలాసార్లు వినిపించాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఫీచర్స్ దాదాపుగా అలాంటివే.
వాట్సాప్ నుంచి కొత్తగా.. మొదటిగా ప్రైవసీ ఫీచర్ ని అందుబాటులో తీసుకొచ్చారు. అదేంటంటే.. గ్రూపులో ఎవరు జాయిన్ కావాలి అనేది అడ్మిన్స్ డిసైడ్ చేయచ్చు. వారి పర్మిషన్ లేకుండా ఇకపై గ్రూపులో వేరే వ్యక్తులు జాయిన్ అయ్యేందుకు వీలుండదు. అలాగే యూజర్స్ వేరే వారితో కలిసి ఉన్న కామన్ గ్రూప్స్ గురించి తెలుసుకోవచ్చు. ఒక కాంటాక్ట్ సెర్చ్ చేసి వారితో మీకున్న కామన్ గ్రూప్స్ ఏంటో చూడచ్చు. వాట్సాప్ చాటింగ్స్, షేర్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పుడు సమాచారాన్ని గ్రూపుల్లో పోస్ట్ చేయడం కూడా సైబర్ నేరం కిందకే వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తెలియని వ్యక్తులు యాడ్ చేసిన గ్రూప్ లో కొనసాగకపోవడమే మంచిది.