ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా సమాచారం చేరవేయాలి అంటే ఉత్తరాల ద్వారా చేరవేసేవారు. ఆనాటి పరిస్థితులను బట్టి రోజులు, నెలలు సమయం పట్టేది. ఒక్కోసారి.. సమయం గడిచాక కూడా చేరేవి. కానీ, ఇప్పుడు అలా కాదు.. టెక్నాలజీ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందులోనూ వాట్సప్ రాకతో .. సమాచార వ్యాప్తిలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఒక వీడియో కాల్ తో మనవారు.. మనతోనే గడుపుతున్న ఆనంద క్షణాలను పొందొచ్చు. మరి.. భవిష్యత్ అవసరాల కోసం ఆ జ్ఞాపకాలను దాచుకోవడమెలా? వీడియోలు అంటే.. డేటా ఎక్కువుగా ఉంటుంది కదా? దాన్ని నుండి తప్పించుకోవడమెలా? అన్న పూర్తి సమాచారం మీకోసం..
వాట్సాప్ లో చాటింగ్, కాల్స్,వీడియోలు పంపడం అన్నీ బాగానే ఉన్నా.. దాన్ని బ్యాకప్ చేసుకోవడం లా అన్నదే ఒక సమస్య. అది కూడా ఒక ఫోన్ నుండి మరొక ఫోన్ కు మారినప్పుడు, అన్ ఇన్స్టాల్ చేసి.. ఇన్స్టాల్ చేసినప్పుడే ఈ సమస్య. ప్రస్తుతానికి గూగుల్ చాట్ ద్వారా బ్యాకప్ చేస్తున్నా.. డేటా వినియోగం కంపల్సరీ అవుతోంది. ఇకపై.. ఆ అవసరం కూడా ఉండబోదు. ఇంటర్నెట్ వినియోగం లేకుండా చాట్ ను బ్యాకప్ చేసుకునేలా కొత్త ఫీచర్ తీసుకురానుంది.. వాట్సాప్. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతానికి సెల్యులార్ లేదా వై-ఫై ద్వారా డేటాను బ్యాకప్ చేస్తున్నాం.. కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేవరకు ఇంటర్నెట్ వినియోగంతో చాట్ బ్యాకప్ లేదా ఎక్సపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్సపోర్ట్ ఆప్షన్ తో టెలిగ్రామ్, ఐమో.. వంటి ఇతర యాప్ లల్లోకి చాట్ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ చేసే విధానం
వాట్సాప్ చాట్లను ఎక్సపోర్ట్ చేసే విధానం
ఇదీ చదవండి: WhatsApp: వాట్సాప్ లో మరో ఇంటరెస్టింగ్ ఫీచర్.. ఆన్లైన్ స్టేటస్ దాచేలా..!