వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వస్తే కనుక అందరూ ధైర్యంగా ఉండవచ్చు. అలానే తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు. ఇంతకే ఆ ఫీచర్ ఏంటంటే?
వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు అనుగుణంగా, సౌకర్యంగా ఉండేలా సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్ సురక్షితం కాదు అన్న ఎలాన్ మస్క్ ఆరోపణలను తిప్పికొడుతూ మార్క్ జుకర్ బర్గ్ సరికొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే గ్రూపుల్లో, చాట్స్ లో ఎవరికైనా పంపిన వాట్సాప్ మెసేజులను ఎడిట్ చేసుకునే ఫీచర్ ను తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ ఫీచర్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మామూలుగా వాట్సాప్ యాప్ ని వేలి ముద్రతో లాక్, అన్ లాక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే లాక్ చేసినా గానీ ఎవరైనా పంపిన మెసేజులు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కనబడతాయి. అయితే ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్ తో ఆ మెసేజులు అనేవి కనబడవు.
చాలా మంది తమ కొంతమందితో చేసే సంభాషణలను ఇతరులకు తెలియకుండా ఉండాలని మేనేజ్ చేస్తుంటారు. బిజినెస్ కి సంబంధించినవి కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు.. ఆ చాట్ సంభాషణ అనేది ఇతరులకు కనబడకుండా దాచాలని అనుకుంటారు. వాట్సాప్ ఆన్ చేయగానే తమ సంభాషణ కనబడకుండా ఆర్చివ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల ఒక వ్యక్తికీ సంబంధించిన చాట్ గానీ గ్రూప్ గానీ ఆర్చివ్డ్ అనే ప్రత్యేకమైన ఫోల్డర్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇది వాట్సాప్ లో టాప్ లో కనబడుతుంది. ఇది అంత భద్రత ఏమీ కాదు కానీ ఎక్కువ మెసేజులు రిపీటెడ్ గా వస్తున్నాయి అంటే గనుక డిస్టర్బెన్స్ గా ఉండకుండా ఉండడం కోసం ఈ ఫోల్డర్ ఉపయోగపడుతుంది.
అయితే ఎవరూ కూడా వేరొకరితో చేసిన చాట్ ని చూడకూడదు, లాక్ చేసుకునే సదుపాయం ఉంటే బాగుణ్ణు అని అనుకునేవారి కోసమే ఈ సరికొత్త ఫీచర్. ‘వాట్సాప్ చాట్ లాక్’ అనే ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది మీ సన్నిహితుల సంభాషణలకు సంబంధించిన చాట్ ను పాస్వర్డ్ తో భద్రపరుస్తుంది. ఎవరైనా మీకు మెసేజులు పంపితే ఆ చాట్ ను లాక్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన ఫోల్డర్ లో భద్రపరుస్తుంది. అంతేకాదు మెసేజులు పంపిన వారి పేరు గానీ, కంటెంట్ ను గానీ ఇది చూపించదు. లాక్ ఓపెన్ చేస్తేనే గానీ వారి ఏం మెసేజ్ చేశారో, ఎవరు పంపారో అనేది తెలియదు.
ఈ వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ మీ సంభాషణలను ఎక్కువ ప్రైవేట్ గా ఉంచుతామని.. ఈ చాట్స్ అనేవి పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేయబడిన ప్రత్యేకమైన ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటాయని.. మెసేజ్ చేసిన వారి పేరు గానీ, మెసేజ్ కంటెంట్ గానీ నోటిఫికేషన్ లో కనబడదని మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో నెటిజన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా మంచి ఫీచర్ అని.. ఇక భార్యలు భర్తల ఫోన్ లు చూసే అవకాశం ఉండదని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరేం అనుకున్నా గానీ వాట్సాప్ చాట్ ప్రైవేట్ గా ఉండాలి, ప్రైవసీ మెయింటెయిన్ చేయాలని కోరుకునే వారికి ఈ ఫీచర్ అనేది ఒక అద్భుతం. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.