ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా టాప్ ప్లాట్ ఫామ్స్ లో ఇన్ స్టాగ్రామ్ ఒకటి. మొదట ఫోటో షేరింగ్ యాప్ ప్రారంభమైన ఇన్ స్టాగ్రామ్.. ఆ తర్వాత ట్రెండ్ కి తగ్గట్లు కొత్త ఫీచర్స్ ను అందిస్తూ వచ్చింది. ఇలా ఎప్పటికప్పడు కొత్త ఫీచర్స్ ను అందిస్తూ.. ఇన్ స్టా యూజర్స్ ను ఆకర్షిస్తోంది. దీంతో ఇందులో రీల్స్ చేసే యూజర్స్ సంఖ్య పెరిగిపోయింది. అయితే తాజాగా మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. యూజర్స కోసం “గిఫ్ట్” అనే కొత్త మానిటైజేషన్ ఫీచర్ తీసుకురానుంది.
డబ్బు సంపాదించడానికి యూజర్స్ కి కొత్త మార్గాన్ని అందించే టిప్పింగ్ ఫీచర్‌ను ఇన్ స్టాగ్రామ్ అంతర్గతంగా పరీక్షిస్తోంది. ఈ గిఫ్ట్ అనే కొత్త ఫీచర్ ద్వారా యూజర్స్ డబ్బు సంపాదించవచ్చు. ” ప్రస్తుతం ఈ ఫీచర్ పై కేవలం అంతర్గతగానే పరీక్షలు జరుగుతున్నాయి, బయట ఎటువంటి టెస్టింగ్స్ చేయడంలేదు” మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు. జూలైలో ఇన్స్టాగ్రామ్ ‘కంటెంట్ అప్రిసియేషన్’ పేరుతో ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఈ ఫీచర్ యాప్ అలెశాండ్రో పలుజ్జీ మొదటిసారి గుర్తించారు. పలుజ్జీ పోస్ట్ చేసిన స్క్రీన్షాట్ల ప్రకారం.. ఈ ఫీచర్ యూజర్స్ కి తమ అభిమానులు ‘ గిఫ్ట్’ పంపడానికి వీలుకల్పిస్తుంది. అయితే ఇన్ స్టా లో క్రియేటర్స్ కొత్త గిఫ్ట్‌ల ట్యాబ్‌లో ఫీచర్‌కు అర్హులో కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. రీల్స్ దిగువన ప్రదర్శించబడే బటన్ ద్వారా వినియోగదారులు గిఫ్ట్ పంపగలరు.
#Instagram continues to work on the Content Appreciation feature 👀
ℹ️ The feature has been renamed to “Gifts” pic.twitter.com/AJmTPZMLsl
— Alessandro Paluzzi (@alex193a) August 25, 2022
ఇదే తరహాలో 2020లో ఇన్స్టాగ్రామ్ బ్యాడ్జ్‌లను ప్రారంభించింది, ఇది లైవ్ వీడియో సమయంలో క్రియేటర్లకు లైక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రత్యక్ష ప్రసార వీడియోలో మీరు బ్యాడ్జ్‌ని కొనుగోలు చేసినప్పుడు, వ్యాఖ్యలలో మీ పేరు పక్కన లవ్ సింబల్ కనిపిస్తుంది. తాజాగా గిఫ్ట్ మానిటైజేషన్ ఫీచర్ తో ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లకు లైవ్ స్ట్రీమ్‌లు మరియు రీల్స్ రెండింటి ద్వారా డబ్బు సంపాదించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఇతర ఇంటర్నల్ ఫీచర్ల మాదిరిగానే ఇది ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల కోసం గిఫ్ట్ ఫీచర్ ను ఎప్పుడు అందించాలని ప్లాన్ చేస్తుందో మాత్రం తెలియదు. మరి.. ఇన్ స్టా తీసుకరానున్న ఈ కొత్తగా ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Instagram keeps working on the Content Appreciation feature 👀 pic.twitter.com/oFrTVLHxO8
— Alessandro Paluzzi (@alex193a) August 19, 2022
#Instagram keeps working on the Content Appreciation feature 👀 pic.twitter.com/oFrTVLHxO8
— Alessandro Paluzzi (@alex193a) August 19, 2022