మీకు స్మార్ట్ ఫోన్ల గురించి సరియైన అవగాహన లేదా? కెమెరా, ప్రాసెస్సర్, ఇంటర్నల్ స్టోరేజ్ విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా?. అటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఒకరైతే.. ఈ పోస్ట్ మీకోసమే. మార్కెట్లో లెక్కలేనన్ని స్మార్ట్ఫోన్లు ఉండడమే అందుకు ప్రధాన కారణం. బడ్జెట్ ధరలో అత్యుత్తమ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకోసం టాప్ 5 స్మార్ట్ఫోన్ల వివరాలను మీకందిస్తున్నాం.. వీటిపై ఓ లుక్కేసి మీకు నచ్చింది సొంతం చేసుకోండి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ-2 లైట్ 5జీ:
మీరు వన్ ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఖచ్చితంగా వన్ ప్లస్ నార్డ్ సీఈ- 2 లైట్ 5జీ మోడల్ని ఎంచుకోవచ్చు. 6.5 ఇంచెస్ డిస్ ప్లే, 64 మెగాపిక్సల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వచ్చిన నార్డ్ సీఈ- 2 అసలు ధర రూ. 19,999 కాగా, 5% తగ్గింపుతో రూ. 18,999కు అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఫీచర్లంటే.. ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.
రియల్మీ నార్జో 50 ప్రో 5జీ:
6.4 ఇంచుల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వచ్చిన రియల్మీ నార్జో 50 ప్రో 5జీ కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని అసలు ధర రూ. 25,999కాగా, 23% తగ్గింపుతో రూ. 19,999 ధరకు అందుబాటులో ఉంది. ఆఫర్ ద్వారా రూ. 6,000 ఆదా అవుతుంది.
రెడ్మీ నోట్ 11టీ 5జీ:
మీరు రెడ్మీ ఫోన్లను ఇష్టపడే వారైతే.. దీనిపై ఓ లుక్కేయండి. 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన రెడ్మీ నోట్ 11టీ 5జీ అసలు ధర 20,999కాగా, 14% తగ్గింపుతో రూ. 17,999 ధరకు అందుబాటులో ఉంది.ఆఫర్ను సరిగ్గా ఉపయోగించుకుంటే, రూ. 3,000 ఆదా చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ జీరో 5జీ:
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మొబైల్ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ కూడా ఒకటి. ఇన్ఫినిక్స్ జీరో 5జీ అసలు ధర రూ. 24,999కాగా, 28% తగ్గింపుతో రూ. 17,999 ధరకు అందుబాటులో ఉంది. ఆఫర్ ద్వారా రూ. 7,000 తగ్గింపుగా పొందవచ్చు. ఈసారి కొత్త కంపెనీ ట్రై చేద్దాం అనుకునేవారు ఈ బ్రాండ్ పై ఓ లుక్కేయోచ్చు.
ఐక్యూ జెడ్6 5జీ:
స్మార్ట్ ఫోన్ రంగంలో ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న ‘ఐక్యూ’ అన్నికంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఐక్యూతోనే సాధ్యం. ఐక్యూ జెడ్6 5జీ అసలు ధర రూ. 19,990కాగా, ప్రస్తుత ఆఫర్లో 25% తగ్గింపుతో రూ. 14,999 ధరకు అందుబాటులో ఉంది. ఆఫర్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, మీకు రూ. 4,991 అదా అవుతుంది.
ఈ ఐదు కూడా రూ.20 వేల లోపు లభించే అత్యుత్తమ స్మార్ట్ఫోన్ మోడల్లు. వీటిలో మీకు ఏది నచ్చింది అన్న విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.