మీరు ఐఫోన్ ప్రియులా? కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 14 సిరీసులో ఏదైనా ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపుతో కొత్త మోడళ్లను సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 14 లేటెస్ట్ మోడళ్లను కొనుగోలు చేస్తే రూ. 50 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్లో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. ఈ ఫోన్ల ఫ్రీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఈ ఐఫోన్స్ ముందుగా కొనుగోలు చేయాలని భావించే వారు ఫ్రీ ఆర్డర్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నాటికి మీకు అందుబాటులో ఉంటాయి.
యాపిల్ ట్రేడ్ ఇన్ స్కీమ్ అంటే ఏమిటి?
ట్రేడ్ ఇన్ ఆఫర్ అనేది కంపెనీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్. ఇది కస్టమర్ తన పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేసినప్పుడు.. దాని విలువను బట్టి కొత్త ఐఫోన్ ధరను తగ్గిస్తుంది. ఇతర కంపెనీల స్మార్ట్ఫోన్లపై కూడా మీరు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. అయితే తగ్గింపు మాత్రం తక్కువగానే ఉంటుంది. ఈ విలువ.. మీరు వాడుతున్న ఫోన్ కండిషన్ బట్టి ఉంటుంది. గరిష్టంగా రూ. 58,730 తగ్గింపును పొందవచ్చు.
ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్:
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫీచర్స్ ను యాపిల్ అప్ గ్రేడ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో పంచ్ హోల్ డిస్ ప్లే, లేటెస్ట్ వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్ 13 కంటే ఈ ఫోన్ మోడల్ లు పెద్దగా ఉన్నాయి. ఇందులో ఫేస్ ఐడి, రెండవది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆసక్తికరంగా, యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్లను పొందవచ్చు.
ఐఫోన్ ప్రో మోడల్ 6.1 అంగుళాల స్క్రీన్ ఉండగా.. ప్రో మాక్స్ మోడల్ 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లా కాకుండా, ప్రో మోడల్స్ లో కొత్త ఏ16 బయోనిక్ చిప్ సెట్ అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో మోస్ట్ పవర్ఫుల్ 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇది పాత మోడళ్లలో కనిపించే 12-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే పెద్ద అప్ గ్రేడ్ . దీనికి 1.4 యూఏఎం పిక్సెల్లతో కూడిన కొత్త 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, హెచ్డీ క్వాలిటీ ఫోటోలు తీసేలా 1.4యూఎం పిక్సెల్, సెటప్ లో 3x ఆప్టికల్ జూమ్ ను అందించే మెరుగైన టెలిఫోటో కెమెరా కూడా ఉంది.
ధరల విషయానికొస్తే..
ఐఫోన్ 14ప్రో ప్రారంభం ధర రూ.1,29,900, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 గా ఉంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లో 128 జీబీ నుంచి 1 టీబీ వరకు వేర్వేరు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. రెండు ఐఫోన్లు సెప్టెంబర్ 9న యూఎస్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి.
మరిన్ని మోడళ్లపై.. యాపిల్ ట్రేడ్ ఇన్ ఆఫర్ విలువను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.