దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా వరుసగా పండగలు రానుండడంతో దేశంలో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేయండి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ కు సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగా, సెప్టెంబర్ 23 – 30 వరకు ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 జరగనుండగా, అమెజాన్ లో సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభం కానుంది. అయితే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 కు సమయం దగ్గర పడుతుండగా.. ఫ్లిప్‌కార్ట్, సేల్ కు సంబంధించిన ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది. అందులో భాగంగా గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ రూ. 16,500 తగ్గింపు ప్రకటించింది. ఆ వివరాలు..
రూ. 16,500 డిస్కౌంట్:
6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ రూ.43,999 ధరలో దేశంలో లాంచ్ అయింది. అయితే.. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం.. ఈ మొబైల్ రూ. 16, 500 తగ్గింపుతో అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపులో బ్యాంక్ ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏ బ్యాంకు వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తిస్తుందనే విషయం టీజర్లో వెల్లడి కాలేదు.
గూగుల్ పిక్సల్ 6ఏ స్పెసిఫికేషన్స్:
6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఆక్టాకోర్ గూగుల్ టెన్సర్ ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కంప్రెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇక, యాస్పెక్ట్ రేషియో 20:9కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 12.2 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే.. బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ చార్జింగ్కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఇక, ఆన్‌బోర్డ్ సెన్సార్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు.