మొదటి నుంచి ఎలాన్ మస్క్ కొంచెం తిక్క మనిషి. తనకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ మావ బాగా నష్టాల్లో కూరుకుపోయాడు. తన సంపాదన చాలా వరకూ కరిగిపోయింది. దీంతో ట్విట్టర్ ని కొన్న పాపానికి డబ్బులు రాబట్టుకోవాలని బ్లూ టిక్ కోసం డబ్బులు వసూలు చేస్తా అని చెప్పాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దీంతో తిక్కరేగి అందరి ఖాతాల నుంచి బ్లూ టిక్ ని తొలగించాడు. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.
ఎవరేమనుకున్నా గానీ తను చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎలాన్ మస్క్. కోట్లు పెట్టి ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. కొనుగోలు చేశాక ఆ లోటుని పూడ్చుకోవడం కోసం బ్లూ టిక్ లు అమ్ముకునే ప్రక్రియను మొదలుపెట్టాడు. నువ్వు డబ్బులియ్, నువ్వు ఎవడివైనా గానీ బ్లూ టిక్ బ్యాడ్జ్ ఇస్తా అని చెప్పి వెల్లడించాడు. నెలకి ఇంత, ఏడాదికి ఇంత అని చెప్పి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు పెట్టాడు. అయితే దీన్ని ప్రపంచంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు వ్యతిరేకించారు. కొంతమంది ఐతే నెల నెలా డబ్బులు చెల్లించి వెరిఫైడ్ బ్యాడ్జ్ ను కొనుక్కుంటున్నారు. కొంతమంది మాత్రం మేము కట్టము, ఏం చేసుకుంటావో చేసుకో’ అన్నట్టు వ్యవహరించారు.
మస్క్ మావ అలా అంటాడు గానీ డబ్బులు వసూలు చేస్తాడా’ అని అనుకున్నారు. కానీ సెలబ్రిటీలకు షాకిస్తూ ఎలాన్ మస్క్ డబ్బులు కట్టలేని వారి ఖాతాల నుంచి వెరిఫైడ్ బ్యాడ్జ్ ని తొలగించింది. క్రికెట్, సినిమా అని తేడా లేకుండా ప్రముఖ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి బ్లూ టిక్ ను తొలగించేశాడు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే, రష్మిక, సమంత, నిధి అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా వంటి వారు ఉన్నారు. వీరి ఖాతాల నుంచి వెరిఫైడ్ బ్లూ టిక్ బ్యాడ్జిని మస్క్ మావ తొలగించాడు. ఈ జాబితాలో తమిళ హీరోలు, మలయాళ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.
దీంతో బ్లూ టిక్ ఇప్పుడు ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ‘నా బ్లూ టిక్ మిస్ అవ్వడం చూసా’ అంటూ నిధి అగర్వాల్ ట్వీట్ చేయగా.. ‘బై బై బ్లూ టిక్’ అంటూ మెహ్రీన్ పిర్జాదా ట్వీట్ చేసింది. రిప్ బ్లూ టిక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మన సెలబ్రిటీలు డబ్బులు కట్టి బ్లూ టిక్ బ్యాడ్జీని కొనుక్కుంటారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారి ఖాతాలకు బ్లూ టిక్ బ్యాడ్జ్ ఉండడం విశేషం. బ్లూ టిక్ తీసేసినందుకు కొంతమంది సెలబ్రిటీలు బాగా అప్ సెట్ అయ్యారు. కోట్లు పెట్టి కొన్నా, ఆ డబ్బులు రాబట్టుకోవద్దా, ఇది యాపారం అని మస్క్ మావ చెప్పకనే చెబుతున్నాడు. మరి డబ్బులు కట్టకపోతే బ్లూ టిక్ ఇవ్వడం కుదరదు అని తెగేసి చెప్పేసిన ఎలాన్ మస్క్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
I see my blue tick is missing 🤔
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) April 20, 2023
Bye bye blue tick 😂
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) April 21, 2023