మొదటి నుంచి ఎలాన్ మస్క్ కొంచెం తిక్క మనిషి. తనకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ మావ బాగా నష్టాల్లో కూరుకుపోయాడు. తన సంపాదన చాలా వరకూ కరిగిపోయింది. దీంతో ట్విట్టర్ ని కొన్న పాపానికి డబ్బులు రాబట్టుకోవాలని బ్లూ టిక్ కోసం డబ్బులు వసూలు చేస్తా అని చెప్పాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దీంతో తిక్కరేగి అందరి ఖాతాల నుంచి బ్లూ టిక్ ని తొలగించాడు. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.
సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరూ ఇన్ స్టానే వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటానికి, రీల్స్ చేసేందుకు ఇన్ స్టాని బాగా వాడుతున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పే ఒక ఘటన జరిగింది.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాక ఛార్జీల బాదుడు ఎక్కువైపోయిందన్న విమర్శలు ఉన్నాయి. వెరిఫైడ్ ఖాతాలను నిర్ధేశించే బ్లూ టిక్ కోసం సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టారు. అయితే కొంతమంది వినియోగదారులు డబ్బులు చెల్లించి బ్లూ టిక్ తీసుకుంటుండగా.. కొందరు మాత్రం మాకు బ్లూ టిక్కు వద్దు, బొటిక్కు వద్దు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమందికి ఉచితంగా బ్లూ టిక్ ను ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సేవలను ఉచితంగా అందించిన మెటా.. ఇక నుంచి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఆ సేవల కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?
టెస్లా కంపెనీ అదినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ని కొన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన రోజుకోక షాక్ ఇస్తూ వస్తున్నాడు. ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత.. బ్లూటిక్ పెయిడ్ వర్షన్ విధానాన్ని తీసుకువచ్చాడు మస్క్. అనగా.. బ్లూటిక్ సదుపాయం కొనసాగించాలంటే.. నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించాడు. ఆ తర్వాత ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు చెల్లించేలా త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాక మస్క్.. ట్విట్టర్‌ను స్వాధీనం […]
బ్లూ టిక్ కావాలా, అయితే డబ్బులు కట్టాల్సిందే. బ్లూ టిక్ ఏంటి? అని అడిగారనుకోండి, ఊరికే ఇచ్చేస్తారేంటి టిక్కు, నెల నెలా అమౌంట్ పే చేయాలి. లేదంటే టిక్కు తీసేస్తామని ఎలాన్ మస్క్ హింట్ ఇచ్చారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు ఉండడం అనేది సహజమే. అయితే ఈ డిజిటల్ సొసైటీలో సెలబ్రిటీల నుంచి సామాన్యులని వేరు చేసేదే బ్లూ టిక్. బ్లూ టిక్ అనేది […]