టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ‘స్మార్ట్’.. వస్తువులకు గిరాకి బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ.. ఇలా అన్ని స్మార్ట్ గా ఉండడానికి జనాలు ఇష్టపడుతున్నారు. అది కూడా తక్కువ ధరలో. ఈ పాయింట్‌నే ప్రామాణికంగా తీసుకుని కంపెనీలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇక.. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రజలంతా టీవీలకు, స్మార్ట్‌ఫోనల్‌కు అతక్కుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు టీవీల వైపు దృష్టిపెట్టాయి. తక్కువ ధరలో స్మార్ట్ టీవీలు లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ బడ్జెట్ ధరలో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.
2020లో ఒప్పో 65 ఇంచెస్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని 50 వేల వరకు ఉండేది. ధర ఎక్కువుగా ఉండడంతో సామాన్యులను అట్ట్రాక్ట్ చేయలేకపోయింది. అందుకే ఈసారి తక్కువ ధరలో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి వదిలింది. ఒప్పో కె9ఎక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదల అయ్యింది. దీని ధర చైనా కరెన్సీలో 1399 యువాన్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 16,500) నిర్ణయించింది. అయితే ఇందులోనూ డిస్కౌంట్ ఉందండోయ్. లాంచ్ ఆఫర్ కింద 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,350) అందుబాటులోకి ఉంచింది. ప్రస్తుతం ఈ టీవిని మనం కొనాలంటే ఒప్పో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాలి.
ఫీచర్స్:
అంతేకాకుండా.. ఈ టీవి మీ కళ్ళపై ఒత్తిడిని తగ్గించడానికి 10.7 బిలియన్ రంగులుతో పాటు బ్లూ-లైట్ తగ్గించే టెక్నాలజీగా కూడా ఉంది. 15 వేల ధరలో 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ అంటే.. మార్కెట్ లో సంచలనం సృస్టించచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్మార్ట్ టీవీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 5జీ టెక్నాలజీ రాబోతోంది.. ఈ క్రమంలో 20వేల లోపు లభించే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ మీకోసం..!
ఇదీ చదవండి: 5జీ టెక్నాలజీ రాబోతోంది.. మీ మొబైల్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా ? లేదా? ఇలా చెక్ చేసుకోండి