హ్యుండాయ్ కార్లకు ఆటో ప్రేమికుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పేరుకు దక్షిణ కొరియా ఆటో దిగ్గజమైన కార్ల ప్రేమికులు స్వదేశీ కంపెనీ అన్నట్లుగానే ఎగబడుతుంటారు. తాజాగా హ్యుండాయ్ మోటార్స్ ఇండియా గురువారం దేశీయ విపణిలో తన అల్కాజర్ ఎస్‌యూవీ న్యూ బేస్ మోడల్ కారును విడుదల చేసింది. దీని ధర రూ.15.89 లక్షల నుంచి మొదలవుతుంది. కొత్త ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర మునుపటి బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ. 55,000 తక్కువకే లభిస్తుంది. అల్కాజార్ ప్రిస్ట్రేజ్.. ఆరు వేరియంట్లలో మార్కెట్‌లోకి రాబోతోంది. ప్రిస్టిజ్, ప్రిస్టీజ్ (ఓ), ప్లాటినం, ప్లాటినం (ఓ), సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ) వేరియంట్లలో రానుంది.
న్యూ మోడల్ అల్కాజర్ ఎస్‌యూవీ మోడల్లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో వైర్‌లెస్ ఆపిల్ కారుప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీతోపాటు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అమర్చారు. అంటే.. ఇంతకుముందు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండేది. దాన్ని రీప్లేస్ చేశారు.
ఇది కూడా చదవండి: Lightyear 0: కార్ల ప్రపంచంలో మరో అద్భుతం! తొలి సోలార్ పవర్ కారు రెడీ.. ప్రత్యేకతలు ఇవే!
అల్కాజార్ న్యూ ప్రిస్టిజ్ వేరియంట్లో 2.0 లీటర్ల ఎంపీఐ ఇంజిన్ అమర్చారు. ఇది 6500 ఆర్పీఎం వద్ద 158 బీహెచ్పీ, 4500 ఆర్పీఎం వద్ద 191 ఎన్ఎం శక్తిని విడుదల చేస్తుంది. అదే.. 1.5 లీటర్ల టర్బో డీజిల్ సీఆర్డీఐ ఇంజిన్ 4000 ఆర్పీఎం వద్ద 113 బీహచ్పీ, 1500 ఆర్పీఎం వద్ద 250 ఎన్ఎం శక్తిని విడుదల చేస్తుంది.
హ్యుందాయ్ అల్కాజర్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ పెట్రోల్ వేరియంట్ MT (7-సీటర్) రూ. 15,89,400, డీజిల్ MT ( 6 మరియు 7-సీట్లు) రూ. 16,30,300 మరియు డీజిల్ AT (7-సీటర్) రూ. 17,77,300 ధరలలో అందుబాటులో ఉండనున్నాయి. హ్యుండాయ్ న్యూ అల్కాజార్ ఎస్‌యూవీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Tata Avinya: టాటా నుంచి మరో సూపర్ కార్.. అరగంట ఛార్జింగ్‌తో 500 కి.మీ. జర్నీ!