కారు కొనడం అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. కొందరు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకుంటారు. అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి.. ఇష్టంగా కారు కొన్నాడు. అలా తాను కొనుగోలు చేసిన కారు.. తన కళ్లముందే కాలి పోయింది.
సొంత కారు కొనాలి అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. చాలా మందికి ఆ కలను తీర్చుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే ఎంతో కష్టపడి ఇష్టంగా కొనుకున్న కారు కళ్ల ముందే కాలిపోతే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే ఎంతో కష్టంగా ఉంది కదా. అలాంటి ఒక అనుభవాన్ని ఎదుర్కొన్న వ్యక్తి తన బాధను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కాడు. అంతేకాదండోయ్ ఆ కారు కంపెనీని ట్యాగ్ చేస్తూ.. వారికి ధన్యవాదాలు కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆ కారు తగలబడిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సదరు కంపెనీ కూడా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలు ఇవే కావచ్చు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచింది.
అయితే ఈ ప్రమాదానికి గురైన కారు మరేదో కాదు.. మహీంద్రా కంపెనీకి చెందిన XUV 700. నిజానికి ఆటో మొబైల్ రంగంలో అత్యంత సేఫ్ కారుగా ఎక్స్ యూవీ 700 మార్కులు కొట్టేసింది. సేల్స్ కూడా విపరీతంగా జరిగాయి. అందరిలాగానే ఎంతో ముచ్చటపడి కులదీప్ సింగ్ అనే వ్యక్తి కూడా ఈ కారును కొనుగోలు చేశాడు. అయితే కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై వెళ్తుండగా.. సడెన్ గా కారులో నుంచి పొగ రావడం కనిపించింది. వారు కంగారుగా కారుని రోడ్డు పక్కన ఆపేసి కిందకు దిగేశారు. కాసేపటికి కారు ఇంజిన్ లో నుంచి మంటలు రావడం ప్రారంభం అయ్యింది. వారు చూస్తుండగానే కారు మంటల్లో కాలిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Thank You Mahindra For Risking My Family’s Life With Your Most Premium
Product (XUV700).
The Car Catches Fire While Driving On Jaipur Highway.
The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS— Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023
ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ.. కారు ఓనర్ వ్యగ్యంగా ట్వీట్ చేశాడు. “మీ అత్యంత ప్రీమియం కారుతో నా కుటుంబం ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు మీకు ధన్యవాదాలు. జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారు ఓవర్ హీట్ కూడా కాలేదు. రన్నింగ్ లో ఉండగా కారులో నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు వ్యాపించాయి” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై మహీంద్రా కంపెనీ స్పందించింది. “ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నాం. ఒక టీమ్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఒరిజినల్ వైరింగ్ ని అదనపు యాక్ససరీస్ జోడించేందుకు ట్యాంపర్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు అనాథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయించకండి. ప్రమాదాలు జరగడానికి కారణం కావచ్చు. మా వినియోగదారుల భద్రతే మాకు ముఖ్యం” అంటూ అధికారిక ప్రకటన విడుదలచేశారు.
కులదీప్ సింగ్ చేసిన ట్వీట్లలో మాత్రం తాను ఎలాంటి మోడిఫికేషన్స్ చేయించలేదని చెబుతున్నాడు. అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా సరైన కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ అనే వాదనను కూడా ఓనర్ కొట్టిపారేస్తున్నాడు. ఇంకి ఎక్స్యూవీ 700 సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.14.01 లక్షలు(ఎక్స్ షోరూమ్) కాగా.. హైఎండ్ కారు రూ.26.18(ఎక్స్ షోరూమ్)లక్షల వరకు ఉంటుంది. ఎక్స్ యూవీ 700 కారులో మంటలు చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Our customers’ safety is always our top most priority. Here is our official statement with reference to an incident on Jaipur National Highway involving the XUV700. pic.twitter.com/hOHEQWhVyC
— Mahindra Automotive (@Mahindra_Auto) May 22, 2023