కారు కొనాలి అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. డీజిల్, పెట్రోల్, ఈవీ, సీఎన్జీ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే వారి వారి అవసరాల రీత్యా ఫ్యూయల్ ని సెలక్ట్ చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా అంతా డీజిల్ కార్లనే ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. కానీ, డీజిల్ కార్ల ఓనర్లకు ఇప్పుడు చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే డీజిల్ కార్లపై బ్యాన్ విధించే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కార్ల వాడకం, కొనుగోలు క్రమంగా పెరుగుతోంది. వ్యక్తిగత అవసరాలు కానీ, ట్రాన్స్ పోర్ట్ పర్పస్ అయినా కూడా కార్లలో ఎక్కువగా డీజిల్ కార్లనే కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈ డీజిల్ కార్లు ఉన్నాయి. ఇంకా కొత్తగా కూడా డీజిల్ కార్లు మార్కెట్ లోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు డీజిల్ కార్ల ఓనర్లకు, కొత్తగా డీజిల్ కారు కొనాలి అని అనుకుంటున్న వారికి ఇది చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే డీజిల్ కార్లపై బ్యాన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని విధి విధానాలను ఆయిల్ మినిస్ట్రీ ప్యానల్ ప్రతిపాదించింది.
దేశంలో పొల్యూషన్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలో చాలా నగరాల్లో గాలి నాణ్యత ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం కూడా కొన్ని కఠిన చర్యలు, విధానాలను పాటిస్తున్న విషయంతెలిసిందే. ఇప్పుడు అవి మరింత కఠినం అయ్యే అవకాశం లేకపోలేదు. ఆయిల్ మినిస్ట్రీ ప్యానల్ కొన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. 2027 తర్వాత డీజిల్ కార్లను బ్యాన్ చేయాలి. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత కార్లను మాత్రమే వాడాలి అని ప్రతిపాదించింది. ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రకంటపనలు రేపుతున్నాయి. ఎందుకంటే దేశంలో మేజర్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ఆధారపడిందే డీజిల్ మీద. అలాంటిది డీజిల్ ని బ్యాన్ చేస్తే ఎలా అనే ప్రశ్న అందరి బుర్రలను తొలిచేస్తోంది.
ప్రజా రవాణాలో 2024 తర్వాత డీజిల్ మోడల్ బస్సులను చేర్చకూడదని సూచించింది. 2024 తర్వాత తీసుకునే బస్సులు అన్నీ ఎలక్ట్రిక్ అయ్యుండాలి తెలిపింది. పది లక్షల జనాభా మించి జీవిస్తున్న అన్ని సిటీల్లో 2027 తర్వాత డీజిల్ కార్లను బ్యాన్ చేయాలని తెలిపారు. అయితే ఈ ప్రతి పాదనలను అంగీకరించడం అంత తేలిక కాదు. డీజిల్ వాహనాల వాడకం ఆపేయాలంటే చాలా కష్టమనే చెప్పాలి. పైగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లాలి అన్నా.. ఇప్పటికీ సరైన ఛార్జింగ్ ఫెసిలిటీస్ లేవు. ఈవీ కార్లు కూడా ఎంతో ఖరీదుగా ఉన్నాయి. కేంద్రం కూడా ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీని మరింత పెంచితే ప్రజలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరి.. ప్యానల్ ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.