సాధారణంగా టూవీలర్ అనగానే అందరూ బడ్జెట్ లో కొనాలి అనుకుంటారు. కానీ, ఇప్పుడు స్కూటీలు కూడా లక్ష దాటిపోయాయి. ఇలాంటి తరుణంలో హోండా కంపెనీ నుంచి స్కూటీ కంటే కూడా అతి తక్కువ ధరలోనే బైక్ తీసుకొచ్చింది. అది కూడా సక్సెస్ ఫుల్ హోండా షైన్ మోడల్ ని తీసుకురావడం విశేషం.
టూ వీలర్ మార్కెట్ లో హోండా కంపెనీకి ఉన్న ఆదరణ, వారి వాహనాలకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే ఇన్ని కంపెనీలు ఉన్నాయి గానీ.. అదే 2010కి ముందైతే బైక్ అంటే హీరో హోండానే. ఆ కంపెనీ మోడల్స్ కి ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్ అంతే. తర్వాత హీరో- హోండా తమ అగ్రిమెంట్ ని ముంగించుకుని విడిపోయాయి. ఆ తర్వాత రెండు కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 125 సెగ్మెంట్ లో హోడాం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ,100సీసీ విభాగంలో మాత్రం హోండా కంపెనీ హీరో మోటో కార్ప్ ని దాట లేకపోతోంది. ఇప్పుడు ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు హోండా కంపెనీ సరికొత్త షైన్ మోడల్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
హోండా కంపెనీ భారత మార్కెట్ లో 100 సీసీ విభాగంలో తమ డిమాండ్ పెంచుకునేందుకు సరికొత్త హోండా షైన్ తీసుకొచ్చింది. ఈ షైన్ 100 సీసీ మోడల్ తో ఈ సెగ్మెంట్ లో కూడా తమ ఆధిపత్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ హోండా షైన్ 100సీసీ మోడల్ రూ.80 వేలకు కొనుగోలు చేయచ్చని చెబుతున్నారు. ఇందలో ఒకటే మోడల్ ఉంది. 5 కలర్ వేరియేషన్స్ తో అందుబాటులోకి రాబోతోంది. ఈ బైక్ లో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం ఏంటంటే.. ఇది స్కూటీ కంటే తక్కువ ధరలో లభిస్తోంది. నిజానికి స్కూటీల ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హోండా షైన్ రూ.80 వేల ప్రైస్ రేంజ్ లో రావడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ హోండా షైన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ హోండా షైన్ 98.9సీసీ సింగిల్ సిలిండర్ తో వస్తోంది. ఇది ఎయిర్ కూల్డ్ మోటార్ తో పనిచేస్తుంది. ఈ బైక్ 8.05NM పవర్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బైకులో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియల్ స్ప్రింగ్ లు, సీబీఎస్ టెక్లాజీతో ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ఈ మోడల్ లో ట్యూబ్ ఉండే టైర్లనే ఇస్తున్నారు. ట్యూబ్ లెస్ టైర్లతో రావడం లేదు. ఇది లీటరుకు 60 నుంచి 70 కిలీ మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఇందులో రెడ్ బ్లూ, గోల్డ్, గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ హోండా షైన్ డీలర్లకు చేరుకున్నాయని చెబుతున్నారు. త్వరలోనే అమ్మకాలు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.