యాపిల్ కంపెనీ తయారుచేసే ఉత్పత్తులకి ఎంత డిమాండ్, క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇతర ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ఖరీదైనా సరే కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే కొనేముందు ఎంతోకొంత డిస్కౌంట్ ఉంటే బాగుణ్ణు అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 మోడల్ ను ఇటీవల భారత మార్కెట్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మీరు గనుక ఈ ఐఫోన్ 14ని కొనాలనుకుంటే గనుక మీ కోసం కొన్ని ఆఫర్లు ఉన్నాయి. రిలీజ్ అయినప్పుడు దీని ఖరీదు 79,900 రూపాయలుగా ఉంది. అమెజాన్ వెబ్ సైట్ లో ప్రస్తుత ధర 78,400 రూపాయలుగా ఉంది. అయితే ఈ ఫోన్ ని 57,100 రూపాయలకే పొందవచ్చు. అదెలాగో ఓ లుక్కేయండి.
128 జీబీ స్టోరేజ్ తో, ఏ15 బయోనిక్ చిప్ సెట్ తో.. ఎలాంటి లైటింగ్ లో అయినా అద్భుతంగా ఫోటోలు తీయగలిగే అడ్వాన్స్డ్ కెమెరా ఆప్షన్ తో ఈ ఐఫోన్ 14 వస్తుంది. అమెజాన్ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ఐఫోన్ ని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే గనుక 5 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ని పొందవచ్చు. అప్పుడు మీకు ఐఫోన్ 14, 73,400 రూపాయలకే దక్కుతుంది. ఒకవేళ మీ పాత ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ చేసి ఐఫోన్ 14ని కొన్నట్లయితే గనుక రూ. 16,300 వరకూ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీరు ఐఫోన్ 14ని 57,100 రూపాయలకే పొందవచ్చు. దీంతో మీకు 21,300 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఐఫోన్ 14 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లేతో తయారైంది. ఇక దీని స్క్రీన్ రెసొల్యూషన్ 2532×1170 పిక్సెల్స్ గా ఉంది. అంతేకాదు ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, వాటర్ రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ తో తయారైంది. ఈ ఫోన్ 128, 256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ తో.. మిడ్ నైట్, పర్పుల్, స్టార్ లైట్, ప్రాడెక్ట్ రెడ్, నీలం బ్లూ కలర్స్ లో లభ్యమవుతుంది. సెల్ఫీ ప్రియుల కోసం 12 ఎంపీ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసింది యాపిల్. బ్యాక్ కెమెరా 12 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో రెండు కెమెరాలతో వస్తుంది.
అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ లో.. 30 ఎఫ్పీఎస్ వరకూ సపోర్ట్ చేసేలా సినిమాటిక్ మోడ్ 4కె డాల్బీ విజన్ ఫీచర్ ఉంది. స్మూత్, స్టడీ, హ్యాండ్ హెల్డ్ వీడియోల కోసం యాక్షన్ మోడ్ కూడా ఉంది. యాపిల్ కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. ఐఫోన్ 14 లో 20 గంటల పాటు కంటిన్యూగా వీడియోలు చూడవచ్చు. 5జి ఎనేబుల్డ్, ఫేస్ ఐడీ అన్ లాక్ ఫీచర్, మరియు ఎమర్జన్సీ ఎస్ఓఎస్, క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్స్ తో తయారైంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఫోన్ ని 57 వేలకే సొంతం చేసుకోండి.