ఆధునిక కాలంలో ఇంటర్ నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయానికి గూగుల్ పై ఆధారపడడం సర్వ సాధారణం అయిపొయింది. ఏ విషయం గురించి సమాచారం కావాలన్నా గూగుల్ ని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. కొందరు మాత్రం గూగుల్ ను దుర్వినియోగం చేస్తున్నారు. గూగుల్ లో చూసి బాంబులు తయారు చేశారనే వార్తలు కూడా మనం వింటూ ఉంటాం. మరికొందరైతే ఆపరేషన్లు కూడా గూగుల్ లో చూసి చేస్తున్నారంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో ఊహించవచ్చు. అయితే గూగుల్ లో కొన్ని అంశాలను వెతికితే ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించి మిమ్ముల్ని జైలుకు పంపిస్తాయి. ఇంతకీ ఆ నిషిద్ధ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
చైల్డ్ పోర్నోగ్రఫీ
చాలా మంది వ్యక్తులు గూగుల్‌లో అశ్లీల సైట్లను సందర్శిస్తారు. కానీ, గూగుల్ లో చైల్డ్ పోర్న్ గురించి సెర్చ్ చేయడం నిషిద్ధం. ఎందుకంటే ఈ విషయంలో భారతదేశంలో ప్రత్యేక చట్టం ఉంది. పోక్సో చట్టం 2012, 14 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించడం, సృష్టించడం లేదా కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరం. ఈ కేసులో ప్రభుత్వం మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై 5 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అబార్షన్
గూగుల్‌లో అబార్షన్ గురించి వెతకడం నిషిద్ధం. ఎందుకంటే భారతదేశంలో సరైన వైద్యుని అనుమతి లేకుండా అబార్షన్ చేయడం చట్టవిరుద్ధం. గూగుల్‌కు దాని గురించి సమాచారం ఉన్నప్పటికీ.. దాని గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం వల్ల మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అబార్షన్ ఎలా జరుగుతుంది? అబార్షన్ ఎలా చేయాలి? ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా ఉంది.
బాంబు ఎలా తయారు చేయాలి?
బాంబు ఎలా తయారు చేయాలి? అని గూగుల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెర్చ్ చేయకండి. అలా చేస్తే మీ కంప్యూటర్ సెక్యూరిటీ ఏజెన్సీల రాడార్ కిందకు వెళ్లిపోతుంది. మిమ్మల్ని మీరు ఇంటెన్సివ్ మానిటరింగ్‌కు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. మీరు సర్చ్ చేసి వదిలేసినా.. మీపై ప్రత్యేక నిఘా ఎప్పటికీ ఉంటుంది. అవసరమైతే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమాచారం కోసం ఎప్పుడూ వెతకకండి.
ఇది కూడా చదవండి: Tamil Nadu: 15 ఏళ్ల బాలికని గర్భవతి చేసిన ఇద్దరు వృద్ధులు! వీళ్ళని ఏమి చేయాలి?