ఒకప్పుడు అంటే ఉత్తరాలు రాసి చెప్పాల్సిన విషయాన్ని చేరవేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. అదే ఉత్తరాన్ని ఇంటర్నెట్ ద్వారా పంపుతున్నారు. దానిని ఎలక్ట్రాని మెయిల్ అంటారు. అందులో జీమెయిల్ కు ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఇప్పుడు గూగుల్ సంస్థ ఆ జీమెయిల్ కి మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తోంది.
సాధారణంగా ఈమెయిల్ అనే పదాన్నే మర్చిపోయారు. అందరికీ ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే జీమెయిల్ మాత్రమే గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ కు కోట్లలో వినియోగదారులు ఉన్నారు. 2004లో గూగుల్ సంస్థ జీమెయిల్ ని పరిచయం చేసింది. అప్పటి నుంచి జీమెయిల్ పోటీ లేకుండా ఎదుగుతూ వచ్చింది. ఇప్పటికే జీమెయిల్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటికి అదనంగా అద్భుతమైన ఫీచర్స్ ని ఇప్పుడు గూగుల్ సంస్థ జీమెయిల్ లో అందుబాటులోకి తీసుకురానుంది. ఆ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది. యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(Google I/O 2023)లో వివరించింది. ప్రస్తుతం అంతా ఈ ఫీచర్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.
జీమెయిల్ కి సంబంధించి ఇప్పటికే చాలా ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జీమెయిల్ మీరు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో సరికొత్త ఫీచర్ ని చూడబోతున్నారు. ఈ ఫీచర్ ద్వారా మీరు జీమెయిల్ లో మెయిల్స్ రాయాల్సిన అవసరం లేదు. “హెల్ప్ మీ రైట్” అని మీరు టైప్ చేస్తే జీమెయిల్ ఏఐ సిస్టమ్ మీకు మెయిల్ రాసేందుకు సహాయపడుతుంది. మీకు ఎలాంటి మెయిల్ రాయాలి? ఏ అసరం కోసం మెయిల్ చేస్తున్నారు? అందుకు కావాల్సిన వివరాలను మీరు అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కావాల్సిన రీతిలో జీమెయిల్.. మెయిల్ ప్రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా మీకు వచ్చే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంది.
అలాగే మీరు ఒక సందర్భం చెబితే మీకు ఒక మంచి ఫార్మాట్ లో మెయిల్ ప్రిపేర్ చేస్తుంది. ఒకవేళ మీరు జాబ్ కోసం అప్లై చేయాలనుకోండి.. ఒక రిక్రూటర్ కి ఫలానా జాబ్ రోల్ కోసం మెయిల్ ప్రిపేర్ చేయమని కోరచ్చు. అప్పుడు జీమెయిల్ ఏఐ సిస్టమ్ మీకు చక్కని మెయిల్ ని రెడీ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొందరు ట్రస్టెడ్ డెవలపర్స్ కి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మరింత మందికి టెస్ట్ అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది చివరికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అలాగే గూగుల్ మ్యాప్స్ లో కూడా సరికొత్త మార్పులు రాబోతున్నాయి.
మంచి 3డీ మ్యాచ్ ఎక్స్ పీరియన్స్ వస్తుందని చెబుతున్నారు. ఆ రూట్ లో ట్రాఫిక్ ఎలా ఉంది? ఎయిర్ క్వాలిటి ఏంటి? వాతావరణం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మరి కాసేపట్లో అక్కడ వాతావరణం ఎలా మారబోతోంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది తర్వాత 15 సిటీల్లో ఈ గూగుల్ మ్యాప్స్ ని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఆ 15 నగరాల్లో లండన్, టోకో, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ ఉంటాయని తెలుస్తోంది. భారత్ లో కూడా ఈ ఇమ్మెర్స్ వ్యూని అందుబాటులోకి తీసుకొస్తారేమో చూడాలి. మరి.. జీమెయిల్ ఏఐ సపోర్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.