భారతదేశం గర్వించదగిన వ్యక్తి సుందర్ పిచాయ్. అతడు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ కు సిఈఒగా కొనసాగుతున్నారు. అతను తమిళనాడులో జన్మించారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం గూగుల్ సిఇవోగా కొనసాగుతున్నారు. అయితే సుందర్ పిచాయ్ తన పూర్వీకులు చెన్నైలో నివాసం ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు అనే వార్త వైరల్ అవుతోంది.

చెన్నై అశోక్ నగర్ లో సుందర్ పిచాయ్ చిన్నప్పుడు గడిపిన ఇంటిని పిచాయ్ తండ్రి విక్రయించారు. ఆ ఇంటిలో పిచాయ్ సుమారు 20ఏళ్ల వయసు వచ్చేంత వరకు అందులోనే ఉన్నారు. ఇప్పుడు దానిని చెన్నైకి చెందిన నటుడు సి మణికందన్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మణికందన్ మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి సుందర్ పిచాయ్ అని తన ఇంటిని సొంతం చేసుకోండం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ, సినీ నిర్మాతగా ఎదిగారు సి. మణికందన్.
సుందర్ పిచాయ్ తండ్రి ఆర్ ఎస్ పిచాయ్ అమెరికాలో స్థిరపడ్డారు. అందుకే పిచాయ్ ఉన్న ఇంటిని కొనడానికి తనకు కొంత టైమ్ పట్టినట్లు వివరించారు. రిజిస్ట్రేషన్ సమయంలో గూగుల్ సిఈఒ పేరును ఉపయోగించకూడదని సుందర్ పిచాయ్ తండ్రి చెప్పాడని మణికందన్ తెలిపాడు. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన పన్ను బకాయిలను చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు.
2004 లో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన టీమ్ కు సారథ్యం వహించారు. సెర్చ్ ఇంజిన్లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌బార్ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2015లో గూగుల్ కంపెనీకి సిఈఒ అయ్యారు. భారత ప్రభుత్వం 2022కి గాను సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.