ప్రస్తుతం స్మార్ట్ ఫోన్..అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏ పనీ ముందుకు సాగట్లేదు. వీటి ఫలితంగా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా .. క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. అంతేకాదు.. వీటితో కాలక్షేపం కూడా అవుతుండడంతో జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. రాను రాను స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నా.. వీటి అమ్మకాల్లో మాత్రం జోరు తగ్గట్లేదు. కంపెనీలు కూడా.. బడ్జెట్ ఫోన్‌లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సెగ్మెంట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అందుబాటు ధరలో.. తాజా ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్లే టార్గెట్‌గా రోజుకో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
తక్కువ ధరలో మంచి మొబైల్ కొనాలనుకున్న వారు.. ఈ బడ్జెట్ ఫోన్లపై దృష్టి సారించవచ్చు. భారత్‌లో రియల్‌మి, రెడ్‌మి, వివో ఇటీవల బడ్జెట్ ఫోన్లను లాంఛ్ చేశాయి.
రియల్‌మి సీ35:
తక్కువ బడ్జెట్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది సరైన ఆప్షన్. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిజైన్‌ను ఇష్టపడే వారు రియల్‌మి సీ35 మెరుగైన ఆప్షన్. ఈ మొబైల్.. 6.6 ఇంచ్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో ట్రిపుల్ కెమరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ టీ616 ప్రాసెసర్‌ను కలిగిఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 11,999 ధరలో అందుబాటులో ఉంది.
Realme C35
Specifications :
◾6.6″ FHD+ LCD Display
◾Unisoc Tiger T616 SoC
◾(50MP+2MP+2MP)* Rear & 8MP* front camera
◾5000mAh Battery
Source – https://t.co/8FXNPv6ppm pic.twitter.com/jdbX2H97rS— Nithin (@_the_tech_guy) February 4, 2022
వివో టీ1 44 డబ్ల్యూ:
ఫాస్ట్‌చార్జింగ్ బ్యాటరీకి ప్రాధాన్యత ఇచ్చే వారు వివో టీ1 44డబ్ల్యూను పరిశీలించవచ్చు. వివో టీ1 44డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను కలిగిఉంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో స్మార్ట్‌ఫోన్ మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ 14,449 నుంచి అందుబాటులో ఉంది.
The @Vivo_India #vivoT144W and #VivoT1pro 5G have been launched in India: Price and Specificationshttps://t.co/ynnkZlYDeB pic.twitter.com/1muNjhAGQ7
— Digit (@digitindia) May 4, 2022
ఒప్పో కే10:
ఈ ఏడాది మార్చిలో ఒప్పో తొలి కే సిరీస్ ఫోన్ కే10ను భారత్‌లో లాంఛ్ చేసింది. సింపుల్ డిజైన్, సెల్ఫీ కెమెరాలను ఇష్టపడేవారికి కే10 మంచి ఆప్షన్. ప్రీమియం రెనో సిరీస్ ఫోన్లలో వాడే రెనో గ్లో డిజైన్‌తో ఈ స్మార్ట్ ఫోన్ ముందుకొచ్చింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు వెనుక భాగంలో రెండు కెమెరాలున్నాయి. 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఒప్పో కే10 రూ 14,990 నుంచి అందుబాటులో ఉంది.
Oppo K10 5G will be launched in India on June 8th, with the following specifications. https://t.co/kQbCIa8dob
— Shoaib (@Shoaib62163414) June 4, 2022
గమనిక: ఈ స్మార్ట్ ఫోన్లు బాగున్నాయి అన్నది.. మా అభిప్రాయం మాత్రమే. అలాగే.. మొబైల్ ధరల్లో, ఆయా ఈ కామర్స్ సైట్లకు అనుగుణంగా మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.