స్మార్ట్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. కానీ, చాలా మంది వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం లేదు. ఇష్టారీతిన స్మార్ట్ ఫోన్ వాడితే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయని గుర్తించడం లేదు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు పేలి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఒక యువకుడికి స్మార్ట్ ఫోన్ వల్ల చేదు అనుభవం ఎదురైంది.
స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల మోడల్స్, 5జీ నెట్ వర్క్, అదిరిపోయే ఫీచర్లతో ఎన్నో ఫోన్లు విడుదల అవుతున్నాయి. వినియోగదారులు కూడా వారి అవసరాలు, బడ్జెట్ ని బట్టి ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోన్ కొనగానే సరిపోదు.. దానిని వాడటం కూడా తెలియాలి. అవును మీకు ఆ ఫోన్ ని సరిగ్గా వాడటం తెలియకపోతే చాలా ప్రమాదమే జరుగుతుంది. ఫోన్లు పేలిపోవడం, మంటలు అంటుకోవడం చూశాం. ఇప్పుడు ఒక యువకుడికి అలాంటి ఒక అనుభవమే ఎదురైంది. జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలడంతో.. మంటలు అంటుకున్నాయి.
ఈ ఘటన కేరళ రాష్ట్రం కోజీకోడ్ ప్రాంతం పయ్యనక్కల్ లో జరిగింది. 23 ఏళ్ల రహ్మాన్ గత రెండేళ్లుగా రియల్ మీ 8 ఫోన్ వాడుతున్నాడు. అప్పటివరకు బాగానే ఉన్న ఫోన్.. ఒక్కసారిగా హీటవ్వడం ప్రారంభమైంది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే.. ఫోన్ నుంచ మంటలు వ్యాపించాయి. అతను వెంటనే తన జీన్స్ ప్యాంట్ తీసి విసిరేశాడు. అప్పటికే అతని కాలు కాలిపోయింది. ఫోన్ పూర్తిగా దగ్ధమైంది. బ్యాటరీ, బ్యాక్ ప్యానల్ మొత్తం కాలిపోయాయి. నిజానికి రహ్మాన్ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఫోన్ పూర్తిగా పేలలేదు. అదే జరిగుంటే అతని ప్రమాణానికే ప్రమాదం జరిగుండేది. ఈ ఘటనలో రహ్మాన్ చిన్న గాయాలతో బయటపడ్డాడు.
స్మార్ట్ ఫోన్లు పేలేందుకు పలు కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారుల అజాగ్రత్త వల్లే పేలే ప్రమాదాలు ఉంటాయి. ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి అలా వదిలేయకూడదు. 90 శాతం దాటిన వెంటనే తీసేయాలి. అలా పెట్టి వదిలేస్తే బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. పైగా బ్యాటరీ ఉబ్బే అవకాశం ఉంటుంది. ఎక్కువ వేడి ప్రదేశంలో ఫోన్ ని నాన్ స్టాప్ గా వాడకండి. స్మార్ట్ ఫోన్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం వాడుతున్న ప్రాసెసర్లు ఊరికే వేడెక్కుతాయి. దాని వల్ల ఫోన్ పేలే ప్రమాదం కూడా ఉంది. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం, ఫోన్ లో వీడియోలు చూడటం చేయకండి అది చాలా ప్రమాదం. ఛార్జింగ్ వల్లే కాకుండా మీరు వాడటం వల్ల ఫోన్ రెట్టింపు వేడెక్కుతుంది. ఫోన్ బ్యాటరీ ఉబ్బితే వెంటనే మార్చేయండి. అధికారిక సర్వీస్ సెంటర్ లోనే ఫోన్ రిపేర్ చేయించండి.
Realme 8 exploded while watching video user admitted to hospital.https://t.co/9A68DXcKZq pic.twitter.com/HiwdXZLRcO
— Abhishek Yadav (@yabhishekhd) May 9, 2023