దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం.. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాల’ పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేస్తూ తమ దేశభక్తిని చాటుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. ఈ వేడుకలను తమ వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశ్యంతో.. ఫైబర్ ప్లాన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఆ వివరేలేంటో ఇప్పుడు చూద్దాం..
భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కు చెందిన మూడు(రూ.449, రూ.599, రూ.999) ప్లాన్స్‌పై ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లు తక్కువ ధరతో పొందడంతో పాటు ఏకంగా 75 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు కొత్తగా బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కనెక్షన్ తీసుకునే యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. అంటే కొత్త కనెక్షన్ తీసుకునే వారు ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లను ఎంపిక చేసుకోవచ్చు. రూ.449, రూ.599, రూ.999 ప్లాన్స్‌పై ఎలాంటి ఆఫర్లు, బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి.
రూ.449, రూ.599 ప్లాన్స్
ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ.449, రూ.599 ప్లాన్‌లను.. రూ.275కే పొందవచ్చు. అంటే.. రూ. 599 ధరతో పోల్చి చూస్తే.. రూ.324 వరకు తగ్గింపుతో పాటు అదనపు కాలపరిమితి దక్కుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 75 రోజులు. 75 రోజుల తర్వాత సాధారణంగా టారిఫ్ ను చెల్లించాల్సి ఉంటుంది.
రూ.999 ప్లాన్:
ఈ ఆఫర్ లో రూ.999 ప్లాన్‌ను రూ.775కే పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 75 రోజులు. వీటితో పాటు ఓటీటీ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. కొత్త కనెక్షన్ కోసం కేవైసీ సమర్పించే సమయంలో కస్టమర్లు ఈ మూడు ఆఫర్స్ ప్లాన్స్‌లో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్ తో రెండు ప్లాన్స్.. జియో 2 ఇన్ 1 ఆఫర్! ఇదే మెుదటి సారి..
ఇదీ చదవండి: Prepaid Recharge Plan: ధమాకా అఫర్.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలివే!