ఈ ఆధునిక కాలంలో ఫోన్ లేని మానవుడు మనకు దాదాపు కనిపించడు. మరి ఆ ఫోన్ నడవాలి అంటే దానికి రీఛార్జ్ చేయించాలి. ప్రస్తుతం మన దేశంలో ఐడియా, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, జియో లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో ఓ అద్బుతమైన ఆఫర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ జియో దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. జియో నెట్ వర్క్ మార్కెట్ లోకి అడుగు పెట్టగానే మిగాతా నెట్ వర్క్స్ అన్నీపడకేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే జియో తనదైన ఆఫర్స్ తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా మరో కొత్త ఆఫర్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. అదే జియో 2 ఇన్ 1 ఆఫర్. రూ. 750 ధరతో ఓ ప్లాన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీంట్లో ఒకటి రూ.749, దాంట్లోనే మరో ప్లాన్ రూ.1గా ప్రకటించింది. అయితే మెుత్తంగా రూ.750 రీఛార్జ్ చేసుకుంటేనే ఈ ప్లాన్ వర్తిస్తుంది. జియో రూ.750 ప్లాన్ పూర్తి వివరాలు.. ఈ ప్లాన్ వ్యాలిడిటి 90 రోజులు. అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ లు, డైలీ 2జీబీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 100ఎంబీ డేటాను రూ.1 ప్లాన్ తో పొందవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకుంటే జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను ఉచితం యాక్సెస్ చేసుకోవచ్చు. రోజులో 2జీబీ+100ఎంబీ డేటా అయిపోయాక 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మరి.. ఈ రూ.750 ప్లాన్ నుపూర్తి కాలం ఉంచుతుందా? లేదా మధ్యలోనే తొలగిస్తుందా అన్న విషయాన్ని మాత్రం సంస్థ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే జియో 5జీ నెట్ వర్క్ ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ సూచనలు చేశారు. అయితే గత నెలలో జరిగిన 5జీ వేలంలో రిలయన్స్ అత్యధిక బిడ్డింగ్ వేసి 5జీ నెట్ వర్క్ ను దక్కించుకున్నసంగతి తెలిసిందే. మరి వినియోగదారులకు జియో కల్పిస్తున్నఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 75 years of Independence is special. So is this plan. Let’s celebrate it together. Recharge Now: https://t.co/yWqruSdBta#JioTogether #JioDigitalLife #75YearsOfIndianIndependence pic.twitter.com/4wF2xHTPDN — Reliance Jio (@reliancejio) August 11, 2022 ఇదీ చదవండి: Oppo: స్మార్ట్‌టీవీ మార్కెట్ లో సంచలనం.. 15 వేల ధరలో 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ! ఇదీ చదవండి: పంత్‌పై ఊర్వశి రౌతెలా సంచలన కామెంట్స్..! అతనో ‘కౌగర్ హంటర్’