ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చాల దేశాల్లో ఎంతో మంది మరణించారు. దశలు మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ తో ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉన్నకరోనా వైరస్ తో భరించలేక పోతుంటే మరో వైరస్ ఏంటని భయపడుతున్నారా?. అవును ఇది వైరస్ కానీ..ఇది మనుషులకు కాకుండా మొబైల్ ఫోన్ లను హ్యాకింగ్ చేస్తోంది. 2019 తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది పెగకాస్. ఇక విషయానికొస్తే…పెగకాస్ అనేది ఎన్ ఎస్ ఓ అనే ఇజ్రాయెల్ సంస్థ దీనిని రూపొందించింది.
దీని వాల్ల ఎంతటి సెక్యూరిటీ మొబైల్ అయినా హ్యాక్ చేసి వారి విషయాలైను ఇట్టే పట్టేయొచ్చు. వారి మొబైల్ ద్వారా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న పూర్తి వివరాలన్నీ రాబట్టే అవకాశాలు ఉంటాయి. తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో 50 దేశాలు ఇందులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా హ్యాకింగ్ ద్వారా తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో 50 దేశాలు ఇందులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఎన్ ఎస్ ఓ కి సంభందించిన డేటా దొరికినట్లు తెలుస్తోంది.
దీని ద్వారా ఎవరెవరి వ్యక్తుల మొబైల్ లను హ్యాక్ చేశారన్న విషయాల్లో కొన్ని జాతీయ మీడియా సంస్థలు పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయట. మరి దీనిపై కొందరు రాజకీయ నేతలు జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా సుబ్రహ్మణ్యం స్వామి కోర్టులో కేసు వేస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇలా వ్యక్తి గత గోప్యతకు భంగం వాటిల్లుతుంటే ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయో కూడా చూడాలి.