Women’s Asia Cup 2022: బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు.. సోమవారం థాయ్‌లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ జట్టు 15.1 ఓవర్లలో 37 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం భారత బ్యాటర్లు 6 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించారు.
ఆసియాకప్‌లో భారత జట్టు విజయాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. దాయాది జట్టైనా పాకిస్తాన్ పై ఓటమి మినహా.. మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ గెలుపొందింది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు థాయ్‌ల్యాండ్ తో జరిగిన మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న స్మృతి మంధాన.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన థాయ్‌ల్యాండ్ జట్టు 15.1 ఓవర్లలో కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు స్నేహ్ రాణా (3/9), రాజేశ్వరీ గైక్వాడ్ (2/8), దీప్తి శర్మ (2/10) మాయాజాలం చేయడంతో ప్రత్యర్ధి బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. థాయ్‌ల్యాండ్ బ్యాటర్లలో ఆ జట్టు ఓపెనర్ నాన్నపట్ చేసిన 12 పరుగులే అత్యధికం.
A splendid bowling performance from #TeamIndia as Thailand are all out for 37!
3️⃣ wickets for Sneh Rana
2️⃣ wickets apiece for Rajeshwari Gayakwad & Deepti Sharma
1️⃣ wicket for Meghna SinghScorecard ▶️ https://t.co/1AVHjyOrSL…#AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/1Sn0uYmoDU
— BCCI Women (@BCCIWomen) October 10, 2022
అనంతరం 38 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (8) తక్కువ స్కోరుకే ఔటైనా.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (20 నాటౌట్), పూజా వస్త్రాకర్ (12 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్న స్నేహా రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత జట్టు టేబుల్ టాపర్ గా (6 మ్యాచ్ ల్లో 5 విజయాలు) సెమీస్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచులు అక్టోబర్ 13న జరగనున్నాయి.
Sneh Rana bags the Player of the Match Award for her impressive three-wicket haul against Thailand as #TeamIndia register a clinical 9-wicket victory. 👏👏
Scorecard ▶️ https://t.co/1AVHjyOrSL…#AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/tBT0qD4g2f
— BCCI Women (@BCCIWomen) October 10, 2022