స్మృతి మంధానను లేడీ విరాట్ కోహ్లీగా ఇన్ని రోజులు ఆకాశానికెత్తిన కోహ్లీ ఫ్యాన్స్, ఇప్పుడు ఆమెను తిట్టిపోస్తున్నారు. తమ పరువు తీస్తోందంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
వరుస ఓటములు క్రికెటర్లను బాధిస్తున్నాయి. విజయం కోసం ఎంతలా శ్రమిస్తున్నపటికీ, ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని కంటతడి పెట్టిస్తోంది. ఆ దృశ్యాలు అభిమానుల హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ రికార్డు నెలకొల్పింది.
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉంటే.. ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఐపీఎల్ ప్రాంచైజీ ఆర్‌సీబీ కథ అందుకు విభిన్నం. జట్టులో ఎంత మంది దిగ్గజ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, విజయం మాత్రం ఆర్‌సీబీకి ఎప్పుడూ ఆమడ దూరమే. అది పురుషులైనా.. విమెన్ అయినా. 'ఈసాలా కప్ నమ్‌దే' అంటూప్రతి సీజన్‌కి ముందు ఆర్‌సీబీ అభిమానులు హడావుడి చేయడం, ఏవేవో సెంటిమెంట్ లెక్కలేసి ఈసారి మా టీమ్ దే కప్పు అని ఆర్భాటాలు చేయడమే తప్ప ఫలితం మాత్రం మారడం లేదు.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారుతోంది. ఆడుతున్న తీరు.. పారుతోన్న బౌండరీలు చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో ముంబై ఇండియన్స్ 207 పరుగులు చేసి ఔరా అనిపించగా.. రెండో మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
సౌరవ్ గంగూలీ.. టీమిండియా క్రికెట్ చరిత్రను మార్చిన గొప్ప ఆటగాడు. ఇక గంగూలీ ఆటకు, బ్యాటింగ్ స్టైల్ కు కోట్లలో అభిమానులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సేమ్ టూ సేమ్.. దాదాను గుర్తు చేస్తోంది టీమిండియా స్టార్ స్మృతి మంధన..
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాటర్ స్మృతి మంధాన జూలు విదిల్చింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మరో ఎండ్ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం రెచ్చిపోయింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ ముందు ఊరించే లక్ష్యం నిర్ధేశించగలిగింది.