చాలామందిలానే ఆ కుర్రాడు కూడా ఇంజినీరింగ్ లో ఫెయిలయ్యాడు. ఏకంగా పదుల సంఖ్యలో బ్యాక్ లాగ్స్. దీంతో చదువుకు ఫుల్ స్టాప్. ఇక ఆ కుర్రాడు సడన్ గా చదువు ఆపేసరికి.. తండ్రి తెగ కంగారు పడ్డాడు. వార్నింగ్ ఇచ్చాడు. అలా జరగకపోతే ఇంటికి రావొద్దని తెగేసి చెప్పాడు. ఇలా ఓ సినిమాకు కావాల్సిన స్టోరీ అంతా ఈ కుర్రాడి లైఫ్ లో ఉంది. అలాంటి ఆ అబ్బాయి ఇప్పుడు ఏకంగా టీమిండియా తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఫలితంగా అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడింది. అతడే షాబాజ్ అహ్మద్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో మన జట్టు అద్భుత విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తో మెప్పించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ అరంగేట్ర మ్యాచులోనే నిలకడతో బౌలింగ్ చేసిన షాబాజ్ అహ్మద్ అభిమానులని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ 10 ఓవర్లు వేసిన షాబాజ్.. 54 పరుగులిచ్చాడు. మలన్ వికెట్ కూడా తీశాడు. మన జట్టు ఈ మధ్య మరీ తీసికట్టుగా మారుతోంది. ఇలాంటి ఈ సమయంలో నిలకడగా బౌలింగ్ చేసిన షాబాజ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయితే షాబాజ్ రియల్ లైఫ్ స్టోరీ వింటే మీరు కచ్చితంగా షాకవుతారు.
ఎందుకంటే.. హర్యానాకు చెందిన షాబాజ్ కి పెద్దగా చదువు అబ్బలేదు. కొడుకుని ఇంజినీర్ చేద్దామని ఇతడిని కాలేజీలో తండ్రి జాయిన్ చేశాడు. కానీ పదుల సంఖ్యలో బ్యాక్ లాగ్స్ ఉండేసరికి చదువు మధ్యలోనే ఆపేశాడు. కొడుకు చదువు ఆపేసి, క్రికెటర్ అవుతాననేసరికి తండ్రి తెగ కంగారుపడిపోయాడు. ఒకవేళ ఆటగాడిగా సక్సెస్ కాకపోతే మాత్రం ఇంటికి రానిచ్చేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. దీంతో సొంతూరు వదిలి కోల్ కతాకు వచ్చిన షాబాజ్.. అక్కడే ట్రైనింగ్ తీసుకుని ఐపీఎల్ లో అవకాశం దక్కించుకున్నాడు. ఆర్సీబీ, దేశవాళీలో ఆకట్టుకునే ప్రదర్శనలు చేసి సెలెక్టర్స్ దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డేలకు ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా మెప్పించాడు.
‘అయితే షాబాబ్ అహ్మద్ ఎప్పుడూ కూడా ఏదైనా పెద్దగా చేయాలని కలలు కనేవాడు. అతడు మంచి స్టూడెంట్ కానీ చదువు మీద అస్సలు ఫోకస్ పెట్టేవాడు కాదని కాలేజీ ఫ్రొఫెసర్లు చెప్పారు. ఓసారి షాబాజ్ తన హెచ్ఓడీతో ‘ఓరోజు మీరు నాకు డిగ్రీ ఇస్తారు, నన్ను సత్కరిస్తారు’ అని చెప్పాడు’ అని షాబాజ్ తండ్రి అహ్మద్ జాన్ చెప్పారు. ఇక కోల్ కతాలో ఉన్న టైంలో షాబాజ్ కష్టాలు చూసి అతడి తండ్రి భరించలేకపోయారని, అప్పుడే క్రికెటర్ గా సక్సెస్ కాకపోతే ఇంటికి రావొద్దని హెచ్చరించారని.. అలా జరిగిన తర్వాతే క్రికెట్ ని షాబాజ్ సీరియస్ గా తీసుకున్నాడని అతడి తల్లి అబ్నం చెప్పారు. మరి షాబాజ్ రియల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.