భారత క్రికెట్ జట్టులోనే కాదు.. ప్రపంచ క్రికెట్లోనూ ఫిట్టెస్ట్ క్రికెటర్ ఏవరు అంటే అందరూ టక్కున చెప్పేపేరు.. విరాట్ కోహ్లీ. ఇది మనం చెప్పక్కర్లేదు.. బీసీసీఐ గణంకాలే ఈ మాట చెప్తున్నాయి. కోహ్లీ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో గాయాల కారణంగా తప్పుకున్న మ్యాచులు నాలుగంటే నాలుగు. తాజాగా ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి బీసీసీఐ పోస్ట్ చేసిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కోహ్లీ ఒక్కడే.. ఎన్సీఏ తలుపు తట్టలేదట.
భారత జట్టులో గాయపడిన క్రికెటర్లు, బెంగళూరులోని ఎన్సీఏ(జాతీయ క్రికెట్ అకాడమీ)లో శిక్షణ తీసుకుని, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఫిట్నెస్ టెస్టు(యోయో టెస్ట్) క్లియర్ చేస్తేనే మళ్లీ భారత జట్టు తరుపున ఆడేందుకు అనుమతిస్తారు. ఇది జాతీయ జట్టుకు ఆడే.. సీనియర్ క్రికెటరయినా, జూనియర్ క్రికెటరయినా ఒకేలా ఉంటుంది. ఇటీవల టీమిండియా యువ క్రికెటర్ పృథ్వి షా యోయో టెస్ట్ క్లియర్ చేయలేక జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఆపై మరోసారి ప్రయత్నించి ఎలాగోలా క్లియర్ చేసాడు.
ఇలా గతేడాది నుంచి ఫిట్నెస్ టెస్టును ఎదుర్కున్న ఆటగాళ్ల లిస్టును బీసీసీఐ ఓ నివేదికలో పేర్కొంది. ఈ లిస్టులో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్లతో పాటు ఇండియా ఏ, ఇండియా అండర్ 19, వుమెన్స్ టీమ్, స్టేట్ ప్లేయర్స్.. ఇలా అందరి జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన 24 మంది క్రికెటర్లలో ఒక్క కోహ్లి మాత్రమే ఎన్సీఏలో అడుగుపెట్టకపోవడం గమనార్హం.
భారత జట్టు తరుపున:
శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ(హ్యామ్స్టింగ్), భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, శిఖర్ ధావన్, అశ్విన్, దీపక్ చాహార్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్(హెర్నియా), రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ఉమేశ్ యాదవ్, వృద్ధిమాన్ సాహా.
ఇండియా ఏ తరుపున:
టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మనీశ్ పాండే, నవ్‌దీప్ సైనీ, ప్రియాంక్ పంచల్, శుబ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్, దేవ్‌దత్ పడిక్కల్, ఇషాన్ పోరెల్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, పృథ్వీ షా, సిమర్జీత్ సింగ్, కెఎస్ భరత్, వరుణ్ అరోన్, వెంకటేశ్ అయ్యర్.
మహిళా జట్టు తరుపున:
దీప్తి శర్మ, ప్రియా పూనియా, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్.
వీళ్ళే కాకుండా కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్, కార్తీక్ త్యాగి వంటి స్టేట్ ప్లేయర్లు కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. కుర్రాళ్లు కూడా గాయాలతో సతమతమవుతూ ఎన్సీఏ చెంతకు చేరుతుంటే, 33 ఏళ్ల విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న విధానం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో కోహ్లీ ఫాన్స్ నెట్టింట నానా రచ్చ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ తలకిందులు తపస్సు చేసినా ఈ విషయంలో కోహ్లీని బీట్ చేయలేరంటూ కామెంట్ చేస్తున్నారు.
This is the NCA list, Players who have done their rehabilitation and treatment in NCA during last season. Virat Kohli is the only big name who didn’t need any rehab. Virat Kohli’s fitness is just unbelievable.#NCA #BCCI #IndianCricketTeam #TeamIndia #ViratKohli𓃵 pic.twitter.com/jjBHyHfo4k
— Bibekananda Sahu (@IamBibeka) October 14, 2022