భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్.. తన అగ్రెసివ్ నేచర్‌తో కూడా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానంలో చాలా అగ్రెసివ్‌గా ఉండే శ్రీశాంత్ బ్యాటర్లను మింగేసేలా చూడటం, వికెట్ పడితే బ్యాటర్ దగ్గరికెళ్లి ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకోవడంలో శ్రీశాంత్‌ది ప్రత్యేక శైలి. తన దూకుడుతో కొన్ని సందర్భాల్లో సమ్యసలను కొనితెచ్చుకున్న శ్రీశాంత్.. మరికొన్ని సార్లు ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే.. వేరే జట్ల అడినప్పుడు శ్రీశాంత్ అగ్రెషన్‌ను ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. అదే పిల్లచేష్టలను క్రికెట్ గాడ్ సచిన్ ముందు చూపించినందుకు హర్ట్ అయ్యారు. అందుకు సచిన్ ఇచ్చిన రిప్లయ్‌కు ఫిదా అయిపోయారు. నిజానికి సచిన్ అంటే ఏంటో శ్రీశాంత్‌కు కూడా బాగా అర్థమైంది అప్పుడే.
2013లో రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ ఛాంపియన్ ముంబై మధ్య ఒక మ్యాచ్‌లో సచిన్ ముంబై తరఫున, శ్రీశాంత్ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల తరఫున బరిలోకి దిగారు. అప్పటికే సచిన్ అరివీర భయంకరంగా ఆడుతూ.. సెంచరీకి దగ్గరగా 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఆ టైమ్‌లో బౌలింగ్‌కు వచ్చిన శ్రీశాంత్.. సచిన్‌కు ఒక సార్ప్ బౌన్స్‌ర్ విసురుతాడు. దాన్ని తప్పుకునే క్రమంలో ఆ బంతి సచిన్ భుజానికి తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్తుంది. టన్నుల కొద్ది పరుగులు కొట్టి, ఇండియన్ క్రికెట్‌కే దేవుడైపోయినా సచిన్ ముందు శ్రీశాంత్ వేస్తున్న బౌన్సర్లు పిల్లచేష్టల్లా కనిపించాయి. ఆ విషయం సచిన్ కూడా అర్థమైంది. కానీ.. అందరిలా దేవుడు నోటితో కాకుండా తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడన్న విషయం తెలిసిందే కాదా..
అలాగే జరిగింది. తర్వాత బంతిని అద్భుతమైన కవర్‌డ్రైవ్‌తో బౌండరీ బాది శ్రీశాంత్ కళ్లు తెరిపించాడు సచిన్. ‘బాబు.. నువ్వు బౌలింగ్ వేస్తోంది సచిన్ టెండూల్కర్‌కి.. ఆ విషయం మర్చిపోకు’ అన్నట్లు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మాస్టర్ బ్లాస్టర్. ఇక శ్రీశాంత్ విషయం పక్కన పెడితే.. సచిన్ ఆడిన ఆ షాట్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అనాల్సిందే. ఫీల్డర్స్ మధ్యలోంచి కొట్టి.. బ్యాట్‌ను అలాగే పట్టుకుని ఒక పోస్టర్లా ఉండిపోయిన సచిన్‌ను ఎన్ని సార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది క్రికెట్ అభిమానులకు. సచిన్ బ్యాట్ నుంచి ఎన్నో అద్భుతమైన షాట్లు వచ్చినా.. ఈ కవర్ డ్రైవ్‌కు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయొక్తిలేదు.