ఇంకొన్ని గంటల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ ఆరంభంకానున్న సంగతి తెలిసిందే. మొదట క్వాలిఫయర్(రౌండ్-1) మ్యాచులు పూర్తయ్యాక, అందులో రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లతో సూపర్-12 పోరు మొదలవుతుంది. ఇక, భారత జట్టు అక్టోబర్ 23న దాయాది పాకిస్తాన్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, రోహిత్ సేనకు కీలక సూచనలు చేశారు. ‘టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని చెప్పిన గంభీర్ అన్నీ ప్రమాదకరంగా కనిపిస్తోన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి శ్రీలంక జట్టుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు’. గంభీర్ ఊరికే ఇలా హెచ్చరించలేదు. దీనీ వెనుక చాలానే అనాలసిస్ దాగుంది.
6 జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ పోరులో టీమిండియా ప్రదర్శన అందరకి తెలిసిందే. టైటిల్ మాదేనంటూ అబుదాబి గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన, కనీసం ఫైనల్ కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. తేలిగ్గా తీసుకుంటే ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదరవుతుందని గంభీర్ హెచ్చరించారు.. ” ఏ జట్టును తేలిగ్గా తీసుకోకండి.. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి శ్రీలంక జట్టుతో మనం జాగ్రత్తగా ఉండాలి. తేలిగ్గా తీసుకుంటే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురు కావొచ్చు. ఆసియా కప్‌లో శ్రీలంక మనపైన సాధించిన విజయమే అందుకు చక్కటి ఉదాహరణ”.
Gautam Gambhir rates Asian Champions Sri Lanka as a potential threat ahead of the T20 World Cup 2022#GautamGambhir #INDvsSL #WorldCup #Cricket pic.twitter.com/z6aETJBWy2
— Govardhan Reddy (@gova3555) October 15, 2022
“ఆసియా కప్‌లో లంక ప్లేయర్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం, ఆడిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ విజయంతో వారు మునుపటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం బరిలోకి దిగొచ్చు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్..ఇలా అన్నింటిలోనూ శ్రీలంక సమతుల్యంగా కనిపిస్తోంది. దుష్మంత చమీర, లహిరు కుమార జట్టులో చేరాక మరింత బలంగా కనిపిస్తోంది. 8,9 స్థానాలలో కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం వారిలో ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచనలు చేస్తున్నానని..” గౌతమ్ గంభీర్ తెలిపారు. అంతేకాదు.. లంకేయులకు ఎవరినైనా ఓడించే సత్తా ఉందని గుర్తుచేశారు.
Former Pakistan and Sri Lanka’s head-coach Mickey Arthur predicts Pakistan vs Sri Lanka final in T20 World Cup 2022.#Pakistan #SriLanka #T20WorldCup2022 #CricketTwitter pic.twitter.com/33vmmZAiNJ
— CricTracker (@Cricketracker) October 15, 2022
దుష్మంత చమీర, లహిరు కుమార జట్టులో పునాగమనం చేయడంతో మరింత బలపడిందని చెప్పుకొచ్చారు గౌతమ్ గంభీర్. ఫలితంగా ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్‌లో శ్రీలంక సమతుల్యంగా కనిపిస్తోందని అన్నారు. ఖచ్చితంగా శ్రీలంక జట్టు ప్రత్యర్థులకు పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. టీ20 ప్రపంచ కప్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు ప్లేయర్లు ఉన్నారని స్పష్టం చేశారు. పొట్టి ఏ జట్టును కూడా తేలికగా తీసుకోకూడదని అన్నారు. కాగా, శ్రీలంక జట్టు సూపర్-12కు నేరుగా అర్హత సాధించలేదు. తొలుత క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సి ఉంది.
All the captains ahead of the T20 World Cup 2022. pic.twitter.com/oym0ruSYCz
— Johns. (@CricCrazyJohns) October 15, 2022