ఐపీఎల్ 2022లో అత్యంత దారుణంగా విఫలం అవుతున్న విరాట్ కోహ్లీ టీమిండియాలో కూడా చోటు కోల్పోయే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆ అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు దాదా వెల్లడించాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌లకు కూడా విశ్రాంతి ఇచ్చే విషయంలో చర్చిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరు గొప్ప ఆటగాళ్లు. వాళ్లిద్దరు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. కచ్చితంగా ఫామ్‌లో వస్తారు. కోహ్లీ ఒక మంచి ప్లేయర్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీ20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. కోహ్లీ జట్టులో ఉంటాడా? లేదా అనేది అనవసరమైన చర్చ. తీరికలేని షెడ్యూల్‌తో బిజీగా ఉన్న కారణంగా సౌతాఫ్రికాతో అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. కోహ్లీ ఒక్కడే కాదు.. రోహిత్, కేఎల్ రాహుల్ సహా మిగతా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. కోహ్లీని పూర్తిగా పక్కనపెడ్తాం అనే వార్తల్లో వాస్తవం లేదు.ఒకవేళ అతను సౌతాఫ్రికాతో సిరీస్ ఆడాలనుకుంటే మాత్రం ఆడుతాడు. ఏదైనా అతన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. కరోనా భయంతో ఐపీఎల్‌లో బయోబబుల్‌ను ప్రవేశపెట్టాం. దేశంలో కరోనా కేసుల్లో పురోగతి లేదనిపిస్తే ఐపీఎల్‌లో బయోబబూల్‌ను తొలగించే అవకాశం ఉంది. కానీ ఏదైనా వేచి చూస్తే మంచిది. ఎందుకంటే కోవిడ్ మనతో పాటు మరో 10 సంవత్సరాలైనా ఉంటుంది. దానిని మనం అలవాటు చేసుకోవాలి. ఆటగాళ్ల శ్రేయస్సు కొరకే బయో బబూల్. కరోనా తగ్గిందంటే ఆటోమెటిక్‌గా బయోబబుల్ మాయమవుతుంది” అంటూ దాదా పేర్కొన్నాడు. కాగా.. ఐపీఎల్ కోహ్లీ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీని విశ్రాంతి పేరుతో జట్టును తప్పించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jason Holder: అవుటై సహనం కోల్పోయిన జెసన్ హోల్డర్! చహార్‌తో గొడవ
BCCI President #SouravGanguly has given his thoughts on the form of batters #RohitSharma and #ViratKohli#IPL2022https://t.co/fCzaMgjbum
— CricketNDTV (@CricketNDTV) April 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.