బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే ఆ క్రికెట్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఆ ఫ్లెక్సీలో సౌరవ్ గంగూలీ ఫోటో లేదు. దాంతో దాదా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
“నువ్వు రాజకీయాలను పట్టించుకోకపోవచ్చు.. కానీ నువ్వు చేసే ప్రతీ పని రాజకీయాలతోనే ముడిపడి ఉంటుంది” అన్నాడు ఓ ప్రముఖ కవి. ఇక ప్రతీ రంగంలో రాజకీయాలు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో కొన్ని రంగాల్లో రాజకీయాలు తలదూర్చేవీ కాదు. అలాంటి రంగాల్లో క్రికెట్ ఒకటి. ఈ క్రమంలోనే భారత క్రికెట్ కు దూరంగా ఉన్న రాజకీయాలు గత కొంతకాలంగా టీమిండియా క్రికెట్ పై తన ముద్రను వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం బయట పెట్టిన ఓ భారీ ఫ్లెక్సీ భారత క్రికెట్ వర్గాల్లో వివాదాన్ని రాజేసింది. దాంతో BCCI ఫై సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దాదా అభిమానుల కోపానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం. ఇక ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ఇద్దరు ప్రధానులు రానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రానున్నారు. ఈ నేథ్యంలో స్టేడియం బయట ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అసలు విషయం ఏంటంటే? బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇద్దరు ప్రధానుల ఫోటోలతో పాటుగా ఇండియా-ఆసిస్ స్టార్ బ్యాటర్ల ఫోటోలు ఆ ఫ్లెక్సీలో వేశారు. అయితే ఈ ఫోటోల్లో సౌరవ్ గంగూలీ ఫోటోను మాత్రం వేయలేదు. దాంతో దాదా ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో బీసీసీఐ పై మండిపడుతున్నారు.
ఇండియన్ క్రికెట్ చరిత్రను మార్చిన దాదానే మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోయినంత మాత్రానా చరిత్ర మా దాదాని మర్చిపోదు అంటూ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలో రోహిత్, సచిన్, కోహ్లీ, ధోని, అశ్విన్, ద్రవిడ్ ఫోటోలను ముద్రించారు, కానీ టీమిండియా క్రికెట్ చరిత్రను, గతిని మార్చిన గంగూలీని ఎలా మర్చిపోయారు అంటూ దాదా అభిమానులతో పాటుగా సగటు క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి నుంచే గంగూలీ అంటే కొందరికి పడేదు కాదన్న వార్తలు కూడా వచ్చాయి. దాంతో మరోసారి గంగూలీపై ఉన్న ద్వేషాన్ని మరోసారి బీసీసీఐ బయటపెట్టింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దాదా ఫోటో లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The main gate of the Narendra Modi Stadium in Ahmedabad. @sportstarweb pic.twitter.com/1Qx39GnJ2E
— Shayan Acharya (@ShayanAcharya) March 7, 2023