బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు. చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ 404 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా. రెండో రోజు రెండో సెషన్‌లో బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది. వచ్చి రావడంతోనే తొలి ఓవర్ తొలి బంతికే మొహమ్మద్ సిరాజ్.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ నజ్ముల్ షాంటోను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్.. యాసిర్ అలీని అవుట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 5 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయింది. కొద్ది సేపు.. లిట్టన్ దాస్-జాకిర్ హసన్ జోడీ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది.
కానీ.. మరోసారి ఎటాక్‌లోకి వచ్చిన సిరాజ్.. వారిద్దరినీ వెనక్కి పంపాడు. 14వ ఓవర్‌లో రెండో బంతికి లిట్టన్ దాస్‌ను అవుట్ చేసిన సిరాజ్.. 18వ ఓవర్ రెండో బంతికి జాకిర్ హసన్‌ను అవుట్ చేసి.. బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక సిరాజ్ శాంతించిన తర్వాత ఎటాక్‌లోకి వచ్చిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంగ్లాను కట్టిపడేశాడు. కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం ముందు బంగ్లాదేశ్ మిడిల్డార్ నిలువలేకపోయింది. బంతిని కుల్దీప్ బంతిని గింగరాలు తిప్పుతుంటే.. బ్యాట్ అడ్డుపెట్టేందుకు వణికిపోయారు. తన స్పిన్ మ్యాజిక్‌తో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(3), నూరుల్ హసన్(16), ముస్తఫీకుర్ రహీమ్(28), తైజుల్ ఇస్లామ్(0) లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చాడు. దీంతో 102 పరుగులకే బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి.. ఫాల్ అన్ ప్రమాదానికి దగ్గర్లో ఉంది. ప్రస్తుతం మెహిదీ మిరాజ్, ఇబాదత్ హుస్సేన్ క్రీజ్‌లో ఉన్నారు.
అయితే.. కుల్దీప్ యాదవ్ అవుట్ చేసిన వారిలో నూరుల్ హసన్ వికెట్ ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే.. శుబ్‌మన్ గిల్ ఒక్క అద్భుతమైన క్యాచ్‌తో నూరుల్‌ను పెవిలియన్ చేర్చాడు. షార్ట్ లెగ్ బ్యాక్‌ప్యాడ్‌లో బ్యాటర్ అతి దగ్గరగా ఫీల్డిండ్ చేస్తున్న గిల్.. నూరుల్ ఆడిన షాట్‌కు బంతి వేగంగా వస్తున్నా.. రెప్పపాటు కాలంలో క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. అయితే.. సూపర్ క్యాచ్ తర్వాత.. విరాట్ కోహ్లీ, గిల్ సెలబ్రేషన్స్ హైలెట్‌గా నిలిచాయి. ‘నూరల్ క్యాచ్ నాకే ఇస్తాడు చూడు అని కోహ్లీకి గిల్ ముందే చెప్పినట్లు.. చూశావా నేను చెప్పినట్లే క్యాచ్ ఇచ్చాడు’ అంటూ కోహ్లీకి చెబుతూ.. వాటేసుకున్నాడు గిల్. దీంతో కోహ్లీకి చెప్పిమరీ గిల్ క్యాచ్ అందుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గిల్, కోహ్లీ అంతలా సెలబ్రేట్ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఆ టైమ్‌లో కోహ్లీ సైతం స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. మరి గిల్ అందుకున్న క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a catch by Gill followed by the celebration with Kohli. pic.twitter.com/0igFI1FacY
— Johns. (@CricCrazyJohns) December 15, 2022
Virat kohli celeberate Shubman Gill’s catch #ViratKohli𓃵 pic.twitter.com/3eXxBAjR7W
— Adnan Ansari (@AdnanAn71861809) December 15, 2022