కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పిన్ వేస్తాడు అనే విషయం అందరికీ తెలుసూ.. కానీ, అప్పుడప్పుడు బ్యాటర్ల వికెట్‌తో పాటు మతి పోయే బాల్స్ వేస్తుంటాడు. అలాంటి డ్రీమ్ డెలవరీని ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వేశాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆసీస్ స్టార్ బ్యాటర్ లబూషేన్ ను పెవిలియన్ కు పంపాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మరికొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గురించి.. భారత మాజీ హెడ్ కోచ్, ప్రఖ్యాత కామెంటేటర్ రవిశాస్త్రి ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడించాలి అనేదానిపై టీమిండియాకు ఒక కీలక సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా రవిశాస్త్రీ మాట్లాడుతూ.. భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లు చాలా కీలక పాత్ర పోషిస్తారని.. దీనికి సంబంధించి ప్లేయింగ్ 11లో స్పిన్నర్లలో ఎవరిని ఆడించాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. […]
ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడుతోంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి టీ20లో గెలిచిన కివీస్.. రెండో మ్యాచ్ లో తడబడింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సన్నద్ధం అయ్యింది భారత జట్టు. ఇక మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్లు […]
లక్నో వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్.. స్పిన్నర్ల మధ్య పోటీగా మారింది. టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్లే ఇన్ని ఓవర్లు వేయడం ఇదే తొలి సారిలా ఉంది. ఇరు జట్లలోనూ ఏకంగా నలుగురు స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగారు. భారత్ 13 ఓవర్లును స్పిన్ బౌలర్లతో వేయిస్తే, న్యూజిలాండ్ ఏకంగా 17 ఓవర్లు స్పిన్నర్లతోనే పూర్తి చేసింది. దీనికి కారణం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడమే. ఇలాంటి పిచ్‌పై స్పిన్నర్లు పండగ చేసుకుంటే.. బ్యాటర్లు వణికిపోయారు. 20 ఓవర్లలో […]
న్యూజిలాండ్‌తో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్ల మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్పీడ్‌స్టర్ మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్.. స్పిన్ సంచలనం కుల్దీప్ యాదవ్‌కు ఏదో వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. అదే టైమ్‌లో మరో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం కుల్దీప్ యాదవ్ చెవులను గట్టిగా పిండుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పంత్ మోకాలికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూజిలాండ్ తో సిరీస్ లోని చివరి వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ […]
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వికెట్లను ఎంత ఈజీగా తీస్తాడో.. ఆఫ్ ది ఫీల్డ్‌లో కామెడీని కూడా అంతే ఈజీగా పండిస్తాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే చాహల్.. సందు దొరికితే ఏదో ఒక రీల్ చేస్తూనే ఉంటాడు. అతని భార్య ధనశ్రీ వర్మతో కూడా కలిసి చాహల్ చాలా రీల్స్ చేశాడు. అలాగే టీమిండియా క్రికెటర్లతోనూ చాహల్ అనేక వీడియోలు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లుతో […]
ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. అయితే మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 1-2తో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ.. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను వైట్‌వాష్ చేసేందుకు రెండో టెస్టు కోసం సిద్ధమైంది. అయితే.. ఈ […]
ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్ ను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాపై టెస్టు సిరీస్ ను గెలిచి ఎలాగైనా విమర్శలకు ధీటుగా జవాబు చెప్పాలని భావించింది. అందుకు తగ్గట్లుగానే తొలి టెస్ట్ లో 188 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టునున ఓడించింది టీమిండియా. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నాలుగో రోజు భారత్ ను వణికించిందనే చెప్పాలి. నాలుగో రోజు […]