శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు వైరల్ అవుతోంది. ఎన్నో అపవాదులు, మరెన్నో అవమానాల తర్వాత తానేంటో తెలియజేశాడు. అసలు టీ20 క్రికెట్ కే పనికిరాడు అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. టీ20ల్లో కూడా శతకం చేశాడు. సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఫామ్ కనబరచడం, వరుస శతకాలు నమోదు చేయడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో […]
ఇండియన్ క్రికెట్‌లో మిస్టర్ 360 ప్లేయర్ ఎవరంటే? కాస్తో కూస్తో క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఠక్కున చెప్పే ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. 30 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చినప్పటికీ.. తన విధ్వంసకరమైన ఆటతో మిస్టర్ 360గా ఫేమ్ తెచ్చుకున్నాడు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ను క్రికెట్ లోకం మిస్టర్ 360 క్రికెటర్ అంటూ పొగిడేది. ఇప్పుడు అది కాస్త సూర్యకుమార్ యాదవ్ పేరు ముందు చేరింది. అయితే.. సూర్య టీమ్‌లో […]
భారతలో క్రికెట్‌ను వ్యక్తుల పేర్లతో మూడు ముక్కల్లో చెప్పాలంటే.. సింపుల్‌గా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు. మూడు తరాల క్రికెట్‌కు ముగ్గురు దిగ్గజాలు. అలాగే కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని.. కెప్టెన్లుగా టీమిండియాను మరో మెట్టు ఎక్కించిన కెప్టెన్లు. భారత క్రికెట్ చరిత్ర గురించి చెప్పాలంటే.. వీరి ప్రస్తావన లేకుండా ఒక పేజీ కూడా పూర్తి కాదు. ఎందుకంటే.. ఇండియన్ క్రికెట్ వారి చేతుల మీదుగానే పెరిగి, అభివృద్ధి […]
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ తేడాతో గెలిచి.. ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ బాదిన గిల్.. దాంతోనే టీమిండియా తరఫున టీ20ల్లో హైఎస్ట్ స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో 122 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును […]
న్యూజిలాండ్ తో జరుగుతు సిరీస్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ లోనూ చెలరేగిపోతుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో మెుదట భారత బ్యాటర్లు చెలరేగారు. శుభ్ మన్ గిల్ మరో సారి తన మార్క షోతో ఆకట్టుకోగా.. త్రిపాఠి అలరించాడు. దాంతో […]
యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్.. కొన్నిరోజుల ముందు ఈ పేరు గట్టిగా వినిపించింది. అందుకు కారణం వన్డేల్లో డబుల్ సెంచరీ. చాలా చిన్న ఏజ్ లోనే ఈ ఫీట్ సాధించేసరికి అందరూ మనోడి గురించి తెగ మాట్లాడుకున్నారు. మనోడి బ్యాటింగ్ పై డౌట్స్ ఉన్నవాళ్లందరికీ తన ద్విశతకంతో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అది జరిగి కొన్నిరోజులైనా కాలేదు. అప్పుడే టీ20ల్లో తొలి శతకం బాదేశాడు. క్లాస్ గా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు కానీ అంతే స్మూత్ […]
క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఈ రోజు క్రియేట్ చేసిన రికార్డు రేపు ఉంటుందో లేదో తెలీదు. రేపు బద్దలు కొట్టిన రికార్డు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. ఇక రికార్డుల రారాజు అని పేరున్న కింగ్ విరాట్ కోహ్లీ రికార్డునే బ్రేక్ చేశాడు టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు ఈ కుర్ర బ్యాటర్. ఇటీవలే […]
న్యూజిలాండ్ తో జరుగుతు నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. కివీస్ బౌలర్లను చితక్కొడుతూ.. భారీ స్కోర్ నమోదు చేశారు. ముఖ్యంగా డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 54 బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు గిల్. తన ఫామ్ ను కొనసాగిస్తూ.. టీమిండియాకు భారీ స్కోర్ ను అందించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి నిరాశ పరచగా.. రాహుల్ త్రిపాఠితో కలిసి ప్రత్యర్థి […]
ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడుతోంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి టీ20లో గెలిచిన కివీస్.. రెండో మ్యాచ్ లో తడబడింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సన్నద్ధం అయ్యింది భారత జట్టు. ఇక మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్లు […]
గత కొంత కాలంగా టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మెగా టోర్నీలు గెలుచుకోలేక పోయినప్పటికీ వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ధోనిలా రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కొందరు మాజీలు ఇటీవల సూచనలు చేశారు. దాంతో రోహిత్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టగల అర్హులపై తాజాగా చర్చనడుస్తోంది. ఇప్పటికే టీ20లకు పాండ్యాను కెప్టెన్ […]