సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 5 టీ20ల సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ వేదికగా ఇరు జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్.. జమ్మూ కశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు తుదిజట్టులో చోటుదక్కడం కష్టంగానే కనపిస్తోంది. మరోవైపు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం పరోక్షంగా ఉమ్రాన్ మాలిక్ కు చోటు కల్పించడం కష్టమనే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ తరఫున అత్యధిక వేగంగా బంతులు సంధించిన ఉమ్రాన్ ను టీమిండియాలో చూడాలని ఎంతో మంది కోరుకున్నారు. కాకాపోతే అది నెరవేరడానికి ఇంకా సమయం పట్టేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ 2022 సీజన్లో ఉమ్రాన్ మాలిక్ అత్యధికంగా 150 కి.మీ.కు పైగా వేగంతో 31 బంతులు సంధించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగపోయే టీ20 సిరీస్ కు అతడిని కూడా ఎంపిక చేశారు. టీమిండియాతో కలిసి ఉమ్రాన్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కోచ్ రాహుల్ ద్రావిడ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు చాలా పెద్దదని.. అందరికీ తుది జట్టులో స్థానం కల్పించడం కుదిరే పని కాదని స్పష్టం చేశాడు.
Snapshots from #TeamIndia‘s training session ahead of the 1st T20I against South Africa.#INDvSA @Paytm pic.twitter.com/wA8O1Xr0i7
— BCCI (@BCCI) June 8, 2022
‘ఐపీఎల్ లో ఎంతో మంది భారత బౌలర్లు మంచి పేస్ తో బౌలింగ్ చేయడం నన్ను ఆకట్టుకుంది. వాళ్లంతా టెస్టుల్లోనూ అదే పేస్ తో బౌలింగ్ చేస్తారని కోచ్ గా ఆశిస్తున్నా. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో మంచి పేస్ ఉంది. అతను చాలా వేగంగా బంతులు వేస్తున్నాడు. కాకపోతే ఇంకా ఉమ్రాన్ మాలిక్ ఇంకా కుర్రాడే.. రోజురోజుకూ నేర్చుకుంటూ మెరుగవుతున్నాడు.’
💬 💬 “A dream come true moment to get India call up.”
Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 – By @28anand
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl
— BCCI (@BCCI) June 8, 2022
‘మాకైతే ఉమ్రాన్ మాలిక్ జట్టులో ఉండటం సంతోషంగా ఉంది. కాకపోతే ఉమ్రాన్ కు ఈ సిరీస్ లో ఎన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం వస్తుందో కచ్చితంగా చెప్పలేము. మేము రియాలిటీకి తగ్గట్లు ఆలోచించాల్సి ఉంటుంది. మా జట్టు చాలా పెద్దది.. తుది జట్టులో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదు. అర్షదీప్ సింగ్ రూపంలో మరో చక్కని పేసర్ జట్టులో అందుబాటులో ఉన్నాడు’ అంటూ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.
Team India’s coach Rahul Dravid on Umran Malik 🗣️#INDvSA | #Cricket #INDvsSA pic.twitter.com/kkZtOb39tI
— Sports Freak (@OfficialSfreak) June 8, 2022
అయితే రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యలు మొత్తం కూడా ఈ సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ అవకాశం దక్కేలా లేదనే హింట్ ఇచ్చినట్లుగా ఉన్నాయి. ఈసారికి ఉమ్రాన్ కు బదులు అర్షదీప్ కు అవకాశం కల్పిస్తామన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున బౌలింగ్ చేస్తే చూడాలని ఆశపడిన ఎంతో మంది ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందేనని తెలుస్తోంది. ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం కల్పించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TeamIndia Head Coach, Rahul Dravid is excited to have someone of @hardikpandya7‘s quality in the side. 👍 👍#INDvSA | @Paytm pic.twitter.com/dszAELbKwy
— BCCI (@BCCI) June 7, 2022