టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి టీమిండియాకు పెద్దగా ఏదీ కలిసి రాలేదు. తాజాగా విండీస్ తో టీ 20 సిరీస్అ ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేసాడు.
దాదాపు నెల రోజులు నుండి జరుగుతున్న వెస్టిండీస్ టూర్ నిన్న చివరి టీ 20 తో ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్ లను దక్కించుకున్న టీమిండియా టీ 20 ల్లో మాత్రం ఆశించిన ప్రదర్శన కనబర్చలేకపోయింది. దీంతో 5 మ్యాచుల టీ 20 సిరీస్ ని 2-3 తేడాతో కోల్పోయింది. నిర్ణయాత్మకమైన 5 వ టీ 20 లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చేతులెత్తేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌పై టీమిండియా సిరీస్ ఓటమిని చవిచూసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ పై విండీస్ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రయోగాలే ఓటమికి కారణమని అభిమానులు మండిపడుతుంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఈ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి టీమిండియాకు పెద్దగా ఏదీ కలిసి రాలేదు. దీంతో ఈ మాజీ వాల్ పై అభిమానులు విమర్శలు గుప్పించారు. స్వదేశంలో త్వరలో వరల్డ్ కప్ మొదలు కానుండడంతో ద్రావిడ్ ని కోచ్ పదవి నుండి తప్పించాలని డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ద్రావిడ్ బయట విషయాలను పట్టించుకోకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేసాడు. తాజాగా ద్రావిడ్ నేతృత్వంలో విండీస్ తో సిరీస్ ఓడిపోయాక ద్రావిడ్ జట్టులోని లోపాలను బయట పెట్టాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా కుదురుకోవడానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు.
ద్రావిడ్ మాట్లాడుతూ ” ఇది యువ జట్టు. ఇప్పుడిప్పుడే జట్టు అభివృద్ధి చెందుతుంది. ఆటలో ఇంకా ఎత్తుపల్లాలు చూడాల్సిన జట్టు. ఈ యంగ్ టీమ్ బ్యాటింగ్ లైనప్‌లో డెప్త్‌ను పెంచాలి అనుకుంటున్నాను. వెస్టిండీస్ జట్టులో చివరిగా బ్యాటింగ్‌కు వచ్చే అల్జారీ జోసెఫ్ సైతం షాట్లు ఆడతాడని, టీమిండియాలో సైతం అలా బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేయాలి”. అని ద్రావిడ్ తెలిపారు. అయితే.. బ్యాటింగ్‌లో డెప్త్ పెంచేందుకు బౌలింగ్‌ను బలహీన పర్చమని కూడా ద్రావిడ్ వెల్లడించారు. అయితే.. మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానున్న తరుణంలో ఇలాంటి ప్రదర్శనను ఎలా చూస్తారని ఎదురైన ప్రశ్నకు ద్రావిడ్ సమాధానమిస్తూ.. అసలు ఇది తమ వన్డే టీమ్ కాదని, చాలా మంది ఆటగాళ్లు వరల్డ్ కప్ కోసం ఉన్నారని అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, షమీ, బుమ్రా ఇలా.. ప్రధాన ఆటగాళ్లు ఈ జట్టులో లేరు” అని తెలిపాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.