క్రికెట్ ఆడే ప్రతి దేశం వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటుంది. పటిష్ట జట్లు, తీవ్ర పోటీ మధ్య ఆడే ఈ టోర్నీలో కప్‌ను కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదు. మరోవైపు ఐపీఎల్ అనేది ఒక లీగ్ మాత్రమే. కానీ ఒక మాజీ ప్లేయర్ మాత్రం ప్రపంచ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడమే కష్టం అంటున్నాడు.
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో తడబడుతున్న టీమిండియా మరోసారి దాన్ని రిపీట్ చేసింది. టెస్టుల్లో ప్రపంచ కప్‌గా భావించే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండోసారి చేరుకున్న భారత జట్టు.. ఇంత చెత్తగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా లాంటి రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్లు మిస్సయినా.. మంచి టీమ్‌తోనే బరిలోకి దిగింది టీమిండియా. కానీ తొలి రోజు నుంచి అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా ఫెయిలైంది. ఈ ఓటమికి క్రికెట్ విశ్లేషకులు అనేక కారణాలు చెబుతున్నారు. జట్టు ఎంపిక, ఆటతీరులో తప్పులను ఎత్తిచూపుతున్నారు. భారత ఓటమికి ఐపీఎల్ కూడా ఒక కారణమని కొందరు క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. జాతీయ జట్టుకు ఆడటం కంటే ఐపీఎల్లో ఆడటమే ప్లేయర్లకు ముఖ్యం అయిపోయిందని విమర్శిస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌ను వదిలేసి.. మ్యాచ్ ప్రాక్టీస్, ప్రిపరేషన్‌తో సిద్ధమైతే రిజల్ట్ మరోలా ఉండేదని చెబుతున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ వినూత్నంగా స్పందించాడు. వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడమే చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో 14 మ్యాచ్‌ల తర్వాత ప్లేఆఫ్స్ ఆడాల్సి ఉంటుందని.. అదే వరల్డ్ కప్‌లో నాలుగైదు మ్యాచ్‌ల తర్వాత సెమీస్‌లో తలపడొచ్చని దాదా చెప్పుకొచ్చాడు. భారత జట్టు టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన తర్వాత అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ రోహిత్ శర్మేనని పేర్కొన్నాడు. అతడి ఖాతాలో 5 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయని గుర్తుచేశాడు. వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్ మరింత దూకుడుగా కెప్టెన్సీ చేయాలని గంగూలీ సూచించాడు. మరి.. ప్రపంచ కప్ కంటే ఐపీఎల్ నెగ్గడమే కష్టం అంటూ దాదా చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sourav Ganguly said, “winning the IPL is even more difficult than winning the World Cup. You’ve to play 14 matches then Playoffs in the IPL whereas you qualify for Semis and then Final after 4-5 matches in the WC”. (On Aaj Tak). pic.twitter.com/FLfP1LF6W9
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 12, 2023