ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నలిచారు. హార్దిక్ పాండ్యా జట్టులో సభ్యుడిగా తానేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. కానీ, కెప్టెన్ గా తానెంత సమర్థుడో హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో నిరూపించుకున్నాడు. వద్దన్న వాళ్లు కూడా వావ్ అనేలా ఈ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యా పర్ఫార్మ్ చేశాడు. అంతేకాకుండా వచ్చే నెల్లో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు కూడా సెలక్ట్ అయ్యి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ ఐపీఎల్ లో తానేంత వాల్యుబుల్ ప్లేయరో నిరూపించుకుని తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు.
ట్రోఫీ కొట్టిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఏం చేస్తున్నాడా అని అంతా ఆలోచిస్తూ ఉన్నారు. అటు హార్దిక్ మాత్రం ఎంతో సింపుల్ గా తన కుమారుడు అగస్త్యతో సరదాగా గడుపుతూ ఉన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హార్దిక్ పాండ్యా.. అగస్త్యను ముద్దాడుతూ లవ్ యూ అంటూ చెప్తున్నాడు. అందుకు అగస్త్య కూడా లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మొత్తం 15 మ్యాచుల్లో 131 స్ట్రైక్ రేట్ తో 487 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇంక బౌలింగ్ విషయానికి వస్తే 7.27 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో హార్దిక్ నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనను చూశారు. ట్రోలర్స్ కు తన ఆటతో సమాధానం చెప్పాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.