బెన్ స్టోక్స్.. ఇటీవల తాను వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో వన్డేకి ముందు ఇదే నా చివరి వన్డే అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. వయసు, బాడీ సహకరించకపోవడం వల్లే తాను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు తొలుత ప్రకటించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో ఇంగ్లాండ్ 62 పరుగుల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది.
సౌత్ ఆఫ్రికాతో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ విషయంలో బెన్ స్టోక్స్ మాట మార్చాడు. అంతేకాకుండా పరోక్షంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై బెన్ స్టోక్స్ ఆరోపణలు చేశాడు. మొదట ఫిట్‌నెస్ అని చెప్పిన స్టోక్స్ ఆ తర్వాత బోర్డు వ్యవహారం నచ్చకే తాను వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పకే చెప్పాడు. అతని వ్యాఖ్యలు కూడా బోర్డును తప్పుబట్టినట్లుగానే ఉన్నాయి.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022
స్టోక్స్ మాట్లాడుతూ.. “ఆటగాళ్లకు కనీస విశ్రాంతి లేకుండా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బిజీ షెడ్యూల్ చేస్తోంది. ఆటగాళ్లు మానసిక ప్రశాంతతకు దూరమౌతున్నారు. నా విషయంలో కచ్చితంగా అదే జరిగింది. విశ్రాంతి లేకుండా పరిగెత్తడానికి మేం కార్లు కాదు.. అవంటే పెట్రోల్ పోస్తే.. ఎంత వేగంగా అయినా వెళ్తాయి. కానీ ఇక్కడ మేం మనుషులం. తీరిక లేకుండా క్రికెట్ ఆడితే అలసిపోతారు. ఆటగాళ్లకు రెస్ట్ కూడా అవసరం.” అంటూ బెన్ స్టోక్స్ వ్యాఖ్యలు చేశాడు.
The runs, wickets and catches were special 👏
But more than anything, cricket is about the memories you make ❤️
An England great 👑 pic.twitter.com/y660cCCeDE
— England Cricket (@englandcricket) July 19, 2022
మొదట నేను వందశాతం ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాను అందుకే తప్పుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత విశ్రాంతి లేకుండా ఆడించడం వల్లే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇవన్నీ చూస్తే బోర్డుకు బెన్ స్టోక్స్ మధ్య చెడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బోర్డు తీరు నచ్చకే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ స్టోక్స్ వ్యాఖ్యలపై స్పందించింది లేదు. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ కు బోర్డుతో గొడవే కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ben Stokes on the hectic English Schedule. #ENGvSA #BenStokes #ECB #englandcricket pic.twitter.com/Zx6Gwm4Iw8
— Fantasy Sports King (@FantasySportsK1) July 19, 2022