వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రినిడాడ్‌కు చేరుకుంది. శుక్రవారం విండీస్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఇక ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇటివల ఇంగ్లండ్‌తో జరిగని టీ20, వన్డే సిరీస్‌లను గెలిచిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో విండీస్‌కు పయనమైంది. వరుస విజయాలతో ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. విండీస్ చేరుకోగానే ధావన్ షేర్ చేసిన వీడియోలో ద్రవిడ్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ధావన్ ముందుండి నడవగా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, చహల్, జడేజా, సిరాజ్ తమదైన శైలిలో హాయ్ అంటూ ఎంట్రీ ఇచ్చారు. ద్రవిడ్ సైతం వారిని అనుసరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ.. కొంచెం సిగ్గుపడుతూ.. హాయ్ అంటూ జట్టును అనుసరించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ద్రవిడ్‌ను ఇంత సరదాగా ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. wait for Rahul Dravid pic.twitter.com/4F7HlVTzkl — Kanav Bali (@Concussion__Sub) July 19, 2022