ప్రస్తుతం క్రీడా లోకంలో క్రికెట్ ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యామాని క్రికెట్ కు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడంటే ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి క్రికెట్ మ్యాచ్ ను ఈజీగా చూడగలుగుతున్నాం. కానీ గతంలో ఈ సౌలభ్యం లేదు. అప్పట్లో ఉన్నదల్ల ఒకే ఒక ఛానెల్ అదే ‘దూరదర్శన్’..DDస్పోర్ట్స్ గా అందరికి సుపరిచతమే. అయితే తాజాగా ఈ ఛానెల్ పై నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి..
ప్రస్తుతం టీంఇండియా వెస్టిండీస్ టూర్ లో ఉంది. ఇక శుక్రవారం తొలి మ్యాచ్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కలమాన ప్రకారం.. రాత్రి 7గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3.30కు ముగుస్తాయి. పైగా ఈ మ్యాచ్‌కు అఫీషియల్ బ్రాడ్ కాస్టర్లుగా.. సోనీ నెట్ వర్క్, స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, నెట్ వర్క్ 18 లాంటి దిగ్గజ సంస్థలు ముందుకు రాలేదు. ఎందుకంటే.. రెవెన్యూ పరంగా.. వ్యూయర్ షిప్ టైమ్ ప్రకారంగా కమర్షియల్‌గా ఆ ఛానళ్లకు వెస్టిండీస్ టూర్ వల్ల పెద్ద లాభాలేవీ రావు. దీంతో టెలీకాస్టుకు అవి దూరంగా ఉన్నాయి.
It is happening after a long time that no sports broadcaster is showing India’s match live on tv and only Doordarshan is telecasting this match live. Thank You @ddsportschannel @BCCI #DDSports #IndvsWI #WIvIND #Shubmangill #ShikharDhawan pic.twitter.com/jaME2GgKsN
— ketan joshi (@KetJoshiEditor) July 22, 2022
ఇక అనూహ్యంగా ఫ్యాన్ కోడ్ యాప్ తక్కువ ధరకే రైట్స్ దక్కడంతో వెబ్ అండ్ యాప్ బేస్డ్ రైట్స్ దక్కించుకుంది. ఫ్యాన్ కోడ్‌లో మ్యాచ్‌లు చూడాలంటే పాస్ కొనుక్కోవాలి. టూర్ పాస్ 99రూపాయాలు కాగా.. యాడ్ ఫ్రీ పాస్ 169రూపాయలు, మంత్లీ పాస్ 199రూపాయలు పెట్టి కొనాలి. ఇది సామాన్యులకు అదనపు భారమే.
#TeamIndia🇮🇳 post a total of 308/7 in 50 overs 🏏 #WIvIND
West Indies need 309 runs to win! pic.twitter.com/sOAU8b2DoX
— Doordarshan Sports (@ddsportschannel) July 22, 2022
భారత్-వెస్టిండీస్ సిరీస్ టెలివిజన్ హక్కుల కోసం ఏ ఛానెల్ బిడ్డింగ్ వేయకపోవడంతో భారత క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రసార శాఖ ఉమ్మడి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ఛానల్ ముందుకు వచ్చింది. ఒకప్పుడు క్రికెట్ అంటేనే దూరదర్శన్.. దూరదర్శన్ అంటేనే క్రికెట్.. క్రమంగా ప్రైవేటు ఛానళ్ల ఆధిక్యత పెరిగాక డీడీ స్పోర్ట్స్ ఛానల్ హవా తగ్గింది. ఇక గత కొన్నిఏళ్లుగా డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో మ్యాచ్‌ల ప్రసారాలు బాగా తగ్గిపోయాయి. కార్పొరేట్ ఆధిపత్యంలో ఉండే స్పోర్ట్స్ ఛానెల్స్ కు ధీటుగా దూరదర్శన్ భారత్ – వెస్టిండీస్ టూర్ ను ప్రసారం చేస్తుండటంతో క్రీడా అభిమానులు తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇది కదా దురదర్శన్ రేంజ్ అంటూ పొగుడుతున్నారు. మరి దూరదర్శన్ ఛానెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Me Watching #DDSports After So Many Year :#WIvIND #INDvWI #INDvsWIonFanCode pic.twitter.com/FAnrACMX5a
— PariSarcasM (@ParisMundhe) July 22, 2022