విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు.. అదిరిపోయే ఫీల్డింగ్‌కు పెట్టింది పేరైన కరీబియన్లు.. తాజా సిరీస్‌లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఎక్కువగా కనిపించే ఆటగాళ్లు ఎవరంటే.. మారు మాట్లాడకుండా కరీబియన్లు అని ఒప్పుకోవాల్సిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), కరీబియన్ క్రికెట్ లీగ్ (సీసీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఇలా దేశంతో సంబంధం లేకుండా.. ఫ్రాంచైజీ లీగ్ జరుగుతుందంటే వెస్టిండీస్ ఆటగాళ్లే ముందు వరుసలో ఉంటారు. ధాటిగా ఆడగల నైపుణ్యంతో పాటు.. కండ్లు చెదిరే ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకోవడం కరీబియన్లకు వెన్నతో పెట్టినే విద్యే! అచ్చం అలాంటి సంఘటనే భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలోనూ చోటు చేసుకుంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలోనూ.. అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. రెండో మ్యాచ్‌లోనే అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. దీంతో టీమిండియాకు మెరుగైన ఆరంభం లభించగా.. ఇక ఈసారైన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగుతాడు అనుకుంటే.. విండీస్ యువ ఆటగాడు అథనాజ్ కళ్లు చెదిరే రీతిలో పట్టిన క్యాచ్‌కు నిరాశగా పెవిలియన్ చేరాడు. షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడో బంతికి పాయింట్ దిశగా కట్ చేయాలనుకున్న కిషన్.. అథనాజ్ చేతికి చిక్కాడు. కుడి వైపు వెళ్తున్న బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో ఒడిసి పట్టిన అథనాజ్.. కిందపడ్డా బంతిపై నియంత్రణ కోల్పోకుండా.. క్యాచ్ పూర్తి చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారగా.. ఇలాంటి ఫీట్లు కరీబియన్లకే సాధ్యమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అథనాజ్ కు ఆటపై ఉన్న మక్కువకు ఇది నిదర్శనమని ఒకరంటే.. వెస్టిండీస్ ప్లేయర్లు ఇలాంటి క్యాచ్‌లు పట్టడం పెద్ద విషయమేం కాదు అని మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి తన సూపర్ క్యాచ్‌తో సాఫీగా సాగుతున్న ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌కు అథనాజ్ బ్రేక్‌లు వేయడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో.. మన జట్టు మామూలు స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. మరి అథనాజ్ పట్టిన సూపర్ క్యాచ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి.