16 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. 19 ఏళ్ళ సచిన్ రికార్డ్ ని దాటేయడానికి కింగ్ రెడీగా ఉన్నాడు.
ఆధునిక క్రికెట్ లో విరాట్ కోహ్లీ టాప్ బ్యాటర్లలో ఒకడనడంలో ఎలాంటిం సందేహం లేదు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఈ జెనరేషన్ లో విరాట్ కోహ్లీని మించిన ప్లేయర్ లేడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో కోహ్లీ ఆల్ టైం బెస్ట్ వన్డే బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. కింగ్ సాధించిన రికార్డులు, గణాంకాలే చూస్తే మనకి అర్ధం అయిపోతుంది. పరుగులు, సెంచరీలు, యావరేజ్ ఇలా ఏ విధంగా చూసుకున్న భవిష్యత్తులో అందరికన్నా ముందంజలో ఉంటాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. తన 16 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. దీంతో 19 ఏళ్ళ సచిన్ రికార్డ్ ని దాటేయడానికి కింగ్ రెడీగా ఉన్నాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే షాకవ్వాల్సిందే. 300 మ్యాచులు ఆడకుండానే 40 కి పైగా సెంచరీలు. దాదాపు 60 యావరేజ్ ని కలిగి ఉన్నాడు. ఇక పరుగుల విషయానికి వస్తే 12,898 పరుగులు చేసి ప్రస్తుత తరంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. మరో 102 పరుగులు చేస్తే చాలు కోహ్లీ 13000 పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 18,426 వన్డే పరుగులతో టాప్‌లో ఉంటే, కుమార సంగర్కర 14234, రికీ పాంటింగ్ 13704, సనత్ జయసూర్య 13430 పరుగులు చేసి టాప్ 4లో ఉన్నారు. అయితే వీరిలో రికీ పాంటింగ్ తప్ప మిగిలిన బ్యాటర్లు అందరూ 400లకు పైగా మ్యాచులు ఆడారు. తాజాగా ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు వేగంగా 13000 పరుగులు చేసిన రికార్డ్ సచిన్ పేరిట ఉంది. ఈ మార్క్ ని చేరుకోవడానికి టెండూల్కర్ కి 321 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. కానీ కోహ్లీ మాత్రం ఇంకా 300 మ్యాచులు కూడా ఆడకపోవడం విశేషం.కోహ్లీ మరో 52 ఇన్నింగ్స్ లు తీసుకొని 102 పరుగులు చేసిన చాలు ఈ అరుదైన రికార్డ్ అతని పేరు మీద లిఖించబడుతుంది. కాబట్టి ఈ రికార్డ్ కోహ్లీ బ్రేక్ చేయడం ఖాయం. 2004 లో పాకిస్థాన్ మీద రావల్పిండి లో సచిన్ 13000 మార్క్ ని అందుకున్నాడు. ఆ రికార్డ్ మరి కొన్ని రోజుల్లో లేదా మరి కొన్ని నెలల్లో కోహ్లీ బ్రేక్ చేయబోతున్నాడు. మరి విండీస్ సిరీస్ లో కోహ్లీ ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాడా? లేకపోతే మరి కాస్త టైం తీసుకుంటాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.