భారత మాజీ వైస్ కెప్టెన్ మరియు భారత అంతర్జాతీయ క్రికెటర్ ‘అజింక్య రహానే’ రెండోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని రహానే భార్య రాధికా దోపవాకర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. కడుపుతో ఉన్న రాధికా.. ఆమె భర్త రహానే, కూతురు ఆర్యతో కలిసి ఉన్న ఫోటోను రాధికా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో రాధికా కడుపుతో ఉండడం గమనించిన అభిమానులు కామెంట్లతో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది అక్టోబర్ నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మెన్ ఇన్ బ్లూ’ తరపున దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో రహానే చివరిసారిగా ఆడారు. ఆ సమయంలో ఆయన తన బ్యాటింగ్ తో ఆకట్టుకోకపోవడంతో ఆయన్ని శ్రీలంక టెస్ట్ సిరీస్ నుండి తొలగించారు. రహానే, రాధికా ఇద్దరూ బాల్య స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడడంతో సెప్టెంబర్ 26 2014లో వివాహం చేసుకున్నారు. 2019 అక్టోబర్ నెలలో వీరికి మొదటి పాప పుట్టింది. ఆ పాపకు ఆర్య అనే పేరు పెట్టారు. మరి రెండోసారి తండ్రి కాబోతున్న రహానేపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Radhika Rahane (@radhika_dhopavkar) ఇది కూడా చదవండి: Shreyas Iyer: విరాట్ కోహ్లీ, ధావన్ తర్వాతి స్థానంలో నిలిచిన శ్రేయస్ అయ్యర్ ఇది కూడా చదవండి: IND vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా! ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్