ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ పలు జట్ల మద్య ఎంతో ఉత్కంఠంగా సాగింది. మొత్తనికి చెన్నై-గుజరాత్ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారం జరుగుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది అంకానికి చేరుకుంది. చెన్నై-గుజరాత్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారం మొదలైంది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని గుజరాత్ జట్టుని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఇక సీజన్ మొదటి నుండి నిలకడగా ఆడుతున్న ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ లో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి. అయితే.. ఫైనల్ లో గిల్ ప్రభంజనాన్ని ధోని ఎలా అడ్డుకుంటాడు అన్న విషయంలోనే పెద్ద చర్చ జరిగింది. దీనికి తగ్గట్టే మహేంద్రుడు తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి.. పవర్ ప్లే ముగియకముందే గిల్ ని అవుట్ చేసి.. తన విలువ ఏమిటో నిరూపించుకున్నాడు.
తొలి రెండు ఓవర్లు కాస్త నిదానంగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు తరువాత చెలరేగిపోయారు. గిల్ అయితే.. తుషార్ దేశ్ పాండే వేసిన మూడో ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టి అందరిని కాస్త భయపెట్టాడు. గిల్ జోరుకి సాహా సీనియారిటీ కూడా తోడు కావడంతో మంచి పార్ట్నర్ షిప్ బిల్డ్ అయ్యింది. ఇక ఇదే ఊపులో గిల్ మరోసారి హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టి.. తన ఫామ్ చాటుకున్నాడు. 5 ఓవర్లలోనే స్కోర్ 62 పరుగులకు చేరుకోవడంతో.. అంతా మరోసారి గిల్ షో రిపీట్ అవ్వడం గ్యారంటీ అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మాస్టర్ బ్రెయిన్ కెప్టెన్ ధోని తెలివిగా అలోచించి స్పిన్నర్ జడేజాని రంగంలోకి దింపి మంచి ఫలితం రాబట్టాడు.
6వ లో బౌలింగ్ కి వచ్చిన జడ్డు.. సరైన లైన్ లో బంతులు సంధించి స్కోర్ ని కట్టడి చేశాడు. ఆ ఓవర్ లో ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో గిల్ కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి ముందుకి వచ్చాడు. అయితే.., ఆ బాల్ కాస్త మిడిల్ కాకపోవడంతో బంతి కీపర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇక మెరుపు వేగంతో మహేంద్రుడు స్టంప్ చేయడంతో గిల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. గిల్ క్రీజ్ వదిలి పెద్దగా ముందుకి వెళ్ళకపోవడంతో అంపైర్స్ కూడా వెంటనే దాన్ని అవుట్ గా ప్రకటించలేదు. కానీ.., థర్డ్ అంపైర్ చెక్ చేయగా ధోని ఎంత స్పీడ్ గా స్టంపింగ్ చేశాడో అందరికీ అర్ధమైంది. మంచి ఫామ్ లో ఉన్న గిల్.. చెన్నై పై ఇలా రెండు సార్లు విఫలం అవ్వడం విశేషం. దీంతో.. గిల్ బాబు అక్కడ ఉంది ధోని. ఆయన ముందా నీ పిల్ల ఆటలు అంటూ ధోని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వయసులో కూడా ధోని ఇంత గొప్పగా కీపింగ్ చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Lightning fast MSD! ⚡️ ⚡️
How about that for a glovework 👌 👌
Big breakthrough for @ChennaiIPL as @imjadeja strikes! 👍 👍#GT lose Shubman Gill.
Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/iaaPHQFNsy
— IndianPremierLeague (@IPL) May 29, 2023