క్రికెట్ ప్రపంచంలో ఇండియా – పాక్ మ్యాచ్ లకు ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరుకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. భారత్ – పాక్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న జట్లు ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్. ఈ టీమ్స్ మధ్య జరిగే యాసెష్ సిరీస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే ఈ జట్ల మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం ప్రపంచానికంతటికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ తో తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇరు టీమ్ ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆసిస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ”కుక్కలు గట్టిగా మెురుగుతాయి అంత మాత్రాన అవి సింహాలు కాలేవు” అంటూ వార్నర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఈ కోల్డ్ వార్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ – పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం మనందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లో రెచ్చిపోయింది. దాంతో 74 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. మరో వైపు ఆసిస్ సైతం 163 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను చిత్తుచేసింది. ఈ క్రమంలో పాక్ పై చరిత్రాత్మక విజయం తర్వాత బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మేము టెస్ట్ మ్యాచ్ లను డ్రాల కోసం ఆడం.. విన్ అవ్వడానికే ఆడుతాం అంటూ కామెంట్స్ చేశాడు.
దాంతో స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఆసిస్ ను ఉద్దేశించినవే అని అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆసిస్ ఎక్కువగా మ్యాచ్ లను డ్రాలుగా చేసుకోవడానికే మెుగ్గు చూపుతుందన్న ఉద్దేశంతోనే స్టోక్స్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ – ఆసిస్ జట్లే టెస్ట్ సిరీస్ లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాఖ్యలపై ఆసిస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ట్వీట్టర్ ద్వారా అదిరిపోయే రిప్లే ఇచ్చాడు. “కుక్కలు గట్టిగా మెురుగుతాయి. అంత మాత్రానా అవి సింహాలు కాలేవు. సింహం ఎప్పటికైనా సింహమే” అంటూ ఉన్న కొటేషన్ ను షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు వార్నర్ ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఉద్దేశించే ఈ పోస్ట్ షేర్ చేశాడని అనుకుంటున్నారు. ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య కోల్డ్ వార్ ఇంకా ముగియలేదా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు సగటు క్రికెట్ అభిమానులు.
Cold war 🥶 pic.twitter.com/j2r5D7pce6
— Out Of Context Cricket (@GemsOfCricket) December 6, 2022