SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 India Lost The Match Against Pakistan In Super 4

Asia Cup 2022: టీమిండియాకు ఎదురుదెబ్బ! కోహ్లీ చెలరేగినా పాక్‌ చేతిలో ఓటమి

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 5 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: టీమిండియాకు ఎదురుదెబ్బ! కోహ్లీ చెలరేగినా పాక్‌ చేతిలో ఓటమి

ఆసియా కప్‌ 2022లో టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌ ఫోర్‌ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓడింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగి ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ మజాను క్రికెట్‌ అభిమానులకు అందించినా.. టీమిండియా చేసిన కొన్ని తప్పులు కూడా ఓటమికి కారణంగా నిలుస్తున్నాయి. చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేని టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌ ఆదివారం మ్యాచ్‌లో మాత్రం బ్రహ్మాండమైన ఆరంభాన్ని అందించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి టీమిండియా ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలబడి హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో టీమిండియా 181 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అయినా కూడా భారత్‌ పాక్‌ చేతిలో ఓడింది. మరి టీమిండియా ఓటమికి గల ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. దారుణంగా విఫలమైన మిడిల్డార్‌
ఓపెనర్లు రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌ టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా 5 ఓవర్లలోపే 50 పరుగులు పూర్తి చేసుకుంది. కానీ.. ఇద్దరు ఓపెనర్లు మంచి టచ్‌లో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయారు. ఒకరి వెంట మరొకరు వెంటవెంటనే అవుట్‌ అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లీ.. నిలకడగా ఆడుతున్నా.. మరోఎండ్‌లో టీమిండియా మిడిల్డార్‌ బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో ఆరంభం చూసి భారత్‌ 200పై చిలుకు పరుగులు చేస్తుందనుకుంటే 181తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం మిడిల్డార్‌ వైఫల్యం కారణంగానే అని గట్టిగా చెప్పవచ్చు.

team india

2. కొట్టొచ్చినట్లు కనిపించిన ఫినిషర్‌ డీకే లోటు
టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయంతో దూరమవ్వడంతో అతని స్థానంలో లెఫ్టాండర్‌గా రిషభ్‌ పంత్‌ను కొనసాగించిన కెప్టెన్‌ రోహిత్‌.. అనూహ్యంగా దినేష్‌ కార్తీక్‌ను పక్కన పెట్టి దీపక్‌ హుడాను జట్టులోకి తీసుకున్నాడు. ఈ నిర్ణయం చివరి ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. హుడా మంచి ఫామ్‌లోనే ఉన్నా.. అతను టాపార్డర్‌ బ్యాటర్‌. కానీ.. పాక్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో బ్యాటింగ్‌ రావడంతో ఒక ఫినిషర్‌ రోల్‌ను భర్తిచేయలేకపోయారు. ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ సైతం చెత్త షాట్లతో దారుణంగా విఫలం అయ్యారు. దీంతో దినేష్‌ కార్తీక్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతను ఉండి ఉంటే.. కచ్చితంగా డెత్‌ ఓవర్స్‌లో మంచి రన్స్‌ వచ్చేవి. కోహ్లీ ఒంటిరి పోరాటం చేసినా.. చివరి ఓవర్‌లో ఆశించిన పరుగులు చేయలేకపోయాడు.

3. వీక్‌ బౌలింగ్‌ ఎటాక్‌
నిజానికి ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన బౌలింగ్‌ ఎటాక్‌ అంత పటిష్టంగా లేదనే విమర్శలు మొదటి నుంచే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ.. ఆవేశ్‌ ఖాన్‌, అర్షదీప్‌ సింగ్‌ తేలిపోయారు. హాంకాంగ్‌ లాంటి పసికూనను కూడా ఆలౌట్‌ చేయకుండా.. 152 పరుగులు సమర్పించుకున్నప్పుడు టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌లో పసలేదని తేలిపోయింది. ఇప్పుడు పాక్‌తో మరింత ప్రయోగం చేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడాపై అతి నమ్మకంతో కేవలం నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగాడు. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాల్‌తోనూ అద్భుతంగా రాణించిన పాండ్యా.. ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 19వ ఓవర్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. జ్వరంతో ఆవేశ్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌లో ఆడక బతికిపోయాడు కానీ.. లేదంటే అతను కూడా టీమిండియా ఓటమికి తన వంతు పాత్ర పోషించేవాడు.

team india

4. చెత్త ఫీల్డింగ్‌
గత కొన్నేళ్లుగా ఫీల్డింగ్‌లో ఒక రేంజ్‌ స్టాండెడ్స్‌ సెట్‌ చేసిన టీమిండియా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన ఫీల్డింగ్‌ మాత్రం నవ్వుల పాలు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో పాక్‌ ఆటగాడు ఫకర్‌ జమాన్‌ రవి బిష్ణోయ్‌ కొట్టిన రెండు షాట్లను చెత్త ఫీల్డింగ్‌ చేసి రెండు బౌండరీలు ఇవ్వడంతో ఇదేం ఫీల్డింగ్‌రా బాబు అంటూ నవ్వుకున్న భారత అభిమానులు కీలక సమయంలో అర్షదీప్‌ సింగ్‌ వదిలేసిన క్యాచ్‌తో ముక్కున వేలేసుకున్నారు. అసిఫ్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అర్షదీప్ సింగ్ వదిలేయడం భారత్ కొంపముంచింది.

5. టాస్‌ ఓడిపోవడం
ఇక అన్నింటి కంటే అతి ముఖ్యమైంది టాస్‌ ఓడిపోవడం. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ టాస్‌ ఓడిపోయాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ తొలుత ఫీల్డిండ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ అంత కీలకం కాదని ఇరు జట్ల కెప్టెన్లు పైపై మాటలు చెప్పినా.. మ్యాచ్‌ గడుస్తున్న కొద్ది టాస్‌ ఎంత కీలకమో అర్థమైంది. పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు మరింత సహకరించింది. దానికి తోడు డ్యూ కూడా రావడంతో టీమిండియాకు కష్టాలు తప్పలేదు. పిచ్‌ పరిస్థితులతో పాటు టీమిండియా చేసిన తప్పులు, వీక్‌ బౌలింగ్‌ ఎటాక్‌, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ వైఫల్యం టీమిండియా ఓటమికి కారణమయ్యాయి. మ్యాచ్‌ అన్నాక గెలుపోటములు సహజం. ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించినా భారత్‌.. ఇప్పుడు పాక్‌ చేతిలో అదే 5 వికెట్ల తేడాతో ఓడింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. తిరిగి ఫైనల్‌లో మళ్లీ ఇండియా-పాక్‌ తలపడే అవకాశం ఉంది. మరి సూపర్‌ ఫోర్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఆ పదాన్ని పలకడానికి ఇబ్బంది పడ్డ రాహుల్ ద్రావిడ్..

What a win! 🇵🇰#INDvPAK | #AsiaCup2022 pic.twitter.com/1KDci25HBz

— ICC (@ICC) September 4, 2022

Rohit expression= whole india expression 😢😢
#INDvsPAK #RohitSharma #Arshdeep pic.twitter.com/WJ43N5w2py

— Shubhankar Mishra (@shubhankrmishra) September 4, 2022

Return Of King 🙌 #ViratKohli #AsiaCupT20 #INDvsPAK pic.twitter.com/rqHDFp0fpM

— Thyview (@Thyview) September 4, 2022

Congrats Team! Very well played.
Keep it up!#INDvsPAK pic.twitter.com/am6LY4r1VT

— Hamza Shahbaz Sharif (@HamzaSS) September 4, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • India vs Pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam