ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ సూపర్-4 లో ఇవాళ రెండో మ్యాచ్ జరగనుంది. శనివారం నాడు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు మొదటి మ్యాచ్ ఆడగా.. శ్రీలంక విజయం సాధించింది. ఇవాళ భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ సూపర్ 4లో రెండో మ్యాచ్ ఆడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ లు తలపడనున్నాయి. గత ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇవాళ మరోసారి భారత్, పాకిస్తాన్ మీద గెలిచేందుకు సిద్ధమవుతోంది. ఇక ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫిరెన్స్ సందర్భంగా రాహుల్ ద్రావిడ్.. పాకిస్తాన్ బౌలర్లని ప్రశంసిస్తూ.. సెక్సీ అనే పదాన్ని పలకలేక నానా తంటాలు పడ్డారు. పాకిస్తాన్ బలమైన లైనప్ ను కలిగి ఉందని, పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించారు. అయితే మన దగ్గర కూడా బౌలింగ్ వనరులు ఉన్నాయని, మన బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. ఒక్కోసారి ఒక్కో బౌలర్ 145 నుంచి 147 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ వేస్తున్నారని, గత వారం భారత్, పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను 147 పరుగులకే పరిమితం చేశారని గుర్తుచేశారు. టీమిండియా బౌలింగ్ కంటే పాకిస్తాన్ బలంగానే ఉన్నప్పటికీ కొన్ని టెక్నిక్స్ విషయంలో పాక్ టీమ్ లో లోపం ఉందని ద్రావిడ్ అన్నారు. సెక్సీ బౌలింగ్ అని మాట్లాడడానికి రాహుల్ ద్రావిడ్ చాలా తంటాలు పడ్డారు. “ఆ పదాన్ని తాను పలకలేనని.. పలకడానికి ఇది వేదిక కాదని, ఎస్ అనే ఇంగ్లీష్ పదంతో మొదలువుతుందని, నాలుగు అక్షరాల పదమని” ద్రావిడ్ ఆ పదాన్ని దాటవేశారు. దీంతో నెటిజన్లు ఆ పదమేంటో మాకు తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సెక్సీ అనే పదాన్ని దాటవేసిన రాహుల్ ద్రావిడ్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. Jammy Sir trying to avoid using ‘Sexy’ for pak bowlers #indvPakpic.twitter.com/lT2AAmnNuv — Mon (@4sacinom) September 3, 2022 ఇది కూడా చదవండి: Asia Cup 2022: రషీద్ ఖాన్, గుణతిలక మధ్య మాటల యుద్ధం..